Breaking News

మగపులిని మట్టుబెట్టారు 

Published on Wed, 01/10/2024 - 05:31

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మగపులిది అసహజ మరణమని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌ డివిజన్‌ దరిగాం–సర్కెపల్లి మధ్య బూడిదమామిడి అడవుల్లో ఈ నెల 6న ఏడాదిన్నర ఆడపులి, ఈ నెల 8న ఐదేరాళ్ల మగపులి (ఎస్‌9) కళేబరాలను గుర్తించిన విషయం తెలిసిందే. అయితే  ఆడపులి మరోపులితో పోరులో చనిపోగా, మగపులి విషంతో చనిపోయినట్టు అధికారులు గుర్తించారు.

మంగళవారం ఎన్‌టీసీఏ (నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ) నియమించిన టీంతో కలిసి  పీసీసీఎఫ్‌ ఆర్‌ఎం డొబ్రియల్, చీఫ్‌ వైల్డ్‌లైఫ్‌ ఇన్‌చార్జి ఎంసీ పర్గేన్, సీసీఎఫ్‌ శాంతారామ్, డీఎఫ్‌ఓ నీరజ్‌కుమార్, కాగజ్‌నగర్‌ ఎఫ్‌డీఓ వేణుబాబు, ఎఫ్‌ఆర్వో వేణుగోపాల్, పశువైద్యాధికారులు, ఎన్జీఓ, ఇతర సిబ్బందితో వివరాలు తీసుకున్నారు. అనంతరం ఎన్‌టీసీఏ నిబంధనల మేరకు అడవిలోనే పులి, పశుకళేబరాలను దహనం చేశారు.

పులిపై విష ప్రయోగం
ఒక పులి అంతర్గత పోరులో, మరో పులి విషం పెట్టడంతో చనిపోయినట్టు ప్రాథమికంగా అంచనాకు వస్తున్నాం. మగపులి మెడకు ఉచ్చు కూడా ఉంది. అది వదులుగా ఉంది. పులి ఉచ్చు పడితే తనంతట తాను తీసుకునే ప్రయత్నం చేస్తుంది.

కనిపిస్తున్న ఆధారాలను బట్టి పులి వేటాడిన పశుకళేబరంలో ఎవరైనా విషం కలిపి ఉండొచ్చు. దానిని తిన్న పులి చనిపోయి ఉండొచ్చనిపిస్తోంది. నమూనాలు మూడు ల్యాబ్‌లకు పంపుతున్నాం. నివేదిక వస్తే స్పష్టత వస్తుంది. ఘటనపై కేసు నమోదు చేశాం. విచారణలో స్థానిక పోలీసు సాయంతో నేరస్తులను పట్టుకుంటాం.    – ఆర్‌ఎం డొబ్రియల్‌ 

పులులెలా చనిపోతున్నాయి?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కవ్వాల్‌ టైగర్‌ కారిడార్‌లో వరుస ఘటనలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. మొదట రెండు పులుల ఆవాస ఆధిపత్య పోరులో ఒకటి చనిపోయిందని తేల్చారు. మరో పులి అదే తీరుగా పొట్లాటలో మృతి చెందిందని చెప్పే ప్రయత్నాలు చేశారు. కానీ ఒకేచోట రెండు మరణించడం, పశువుల కళేబరాలు ఉండడంతో ఆ దిశగా విచారణ మొదలైంది. ‘తడోబా–అందేరి’, ‘తిప్పేశ్వర్‌’కు పెన్‌గంగా, ప్రాణహిత పక్కనే ఉన్న కాగజ్‌నగర్‌ పులుల రాకపోకలకు ప్రధాన కారిడార్‌గా ఉంది.

దరిగాం సమీపప్రాంతాల్లోనే ఎస్‌9 మగపులి, ఎస్‌6 అనే ఆడపులితో జతకట్టడంతో నాలుగు పిల్లలు జన్మించాయి. వాటి వయసు రెండేళ్లు దాటడంతో ఆవాసం వెతుక్కుంటున్నాయి. మరోవైపు ఎస్‌6 కోసం మరో మగపులి రావడం, అక్కడే ఎస్‌9 కూడా ఉండడంతో ఆధిపత్య పోరు మొదలైంది. ఇలా తల్లి, నాలుగు పిల్లలు, మగపులులతో అక్కడే సంచరిస్తున్నాయి. అడవిలో వన్యప్రాణుల లభ్యత లేక స్థానిక గిరిజన రైతుల పశువులే వాటికి ఆహారంగా మారాయి. రెండేళ్లుగా ఆరు పశువులను చంపగా, కొందరికే పరిహారం రాగా, మరికొందరికి అందలేదు.

పశువులపై దాడులతో ప్రతీకారమా...
పశువులను చంపేస్తున్న పులులను హతమార్చాలని ఎవరైనా కోపంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? అనే కోణంలో విచారణ మొదలైంది. గతంలో పులులకు ఉచ్చులు బిగిసి ఇబ్బంది పడిన ఘటనలు ఉన్నాయి. ఐదేళ్ల క్రితం చెన్నూరు డివిజన్‌లో అమర్చిన ఉచ్చుకు  కే4 ఆడపులి చిక్కి నడుము భాగంలో ఉండిపోయింది. ఇప్పటికీ ఆ పులి జాడ లేదు. అదే డివిజన్‌ శివ్వారం, ఉట్నూరు డివిజన్‌లోనూ ఉచ్చులతో పులులకు ముప్పు జరిగాయి. 

ఎస్‌6, ఆ పిల్లలు సురక్షితమేనా? 
ఎస్‌6తోపాటు మరో మూడు పిల్లలు క్షేమంగా ఉన్నాయా? అనే అనుమానాలు వస్తున్నాయి. పులుల మరణానికి ముందు చివరగా దరిగాం పరిధిలోనే ఓ పశువును హతమార్చి భుజిస్తుండగా కెమెరాకు చిక్కాయి. ఆ తర్వాత వాటి జాడ లేదు. ఆవాసాల ఆధిప్యత పోరు, కొత్త పులి రాకతో ఘర్షణతో వేరే చోటుకు వెళ్లాయా? లేక విషం, ఉచ్చుల బారిన పడ్డాయా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వీటి ఆచూకీకి 50 మంది యానిమల్‌ ట్రాకర్స్‌ వెతుకుతున్నారని, ఈ చుట్టుపక్కల యాభైదాకా కెమెరా ట్రాక్‌లను అమర్చి పర్యవేక్షిస్తున్నట్టు ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)