Breaking News

Hyderabad: ‘గే’ యాప్‌లో పరిచయం.. ఇంటికి పిలిచి..

Published on Mon, 02/10/2025 - 14:04

ఫిలింనగర్‌: ‘గే’ యాప్‌లో పరిచయం చేసుకుని బ్లాక్‌మెయిల్‌ చేస్తూ డబ్బులు దండుకుంటున్న నిందితుడిని ఫిలింనగర్‌ పోలీసులు ఫోన్‌ పే ద్వారా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. డబీర్‌పురాలో నివసించే పర్హాన్‌బేగ్‌ (25) జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం జెండర్‌ యాప్‌లో ’గే’లను పరిచయం చేసుకుంటూ వారిని తనవద్దకు రప్పించి వీడియోలు తీస్తూ బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ డబ్బులు దండుకుంటున్నాడు. 

షేక్‌పేట జైహింద్‌నగర్‌కు చెందిన ఓ యువకుడి (22)ని గత నెల జెండర్‌ యాప్‌లో పరిచయం చేసుకుని తన వద్దకు రప్పించుకున్నాడు. ఇంటికి వెళ్లిన సదరు యువకుడితో సన్నిహితంగా మెలుగుతూ వీడియో రికార్డ్‌ చేసి బ్లాక్‌మెయిల్‌ చేయడం మొదలుపెట్టాడు. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానంటూ  బెదిరించి రూ.15 వేలు డిమాండ్‌ చేశాడు. అయితే బాధితుడు రూ.10 వేలను ఫోన్‌ పే ద్వారా నిందితుడికి బదిలీ చేశాడు. 

తాను మోసపోయానని తెలుసుకుని ఈ నెల 1న ఫిలింనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితుడి ఫోన్‌ పే ఆధారంగా కాల్‌ డేటా సేకరించి ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పర్హానబేగ్‌ ‘గే’ కాదని, కేవలం ‘గే’లను పరిచయం చేసుకుని బ్లాక్‌ మెయిల్‌ చేసేందుకు జెండర్‌ యాప్‌లో ఉన్నాడని, గతంలో కూడా ఇలాంటి బ్లాక్‌మెయిలింగ్‌ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఫిలింనగర్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

 

 

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)