Breaking News

కడుపునొప్పితో వస్తే కాటికి పంపేశారు!

Published on Mon, 01/27/2025 - 07:07

కంటోన్మెంట్‌: కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరితే కాటికి పంపారని,  అర్హత, అనుభవం లేని డాక్టర్‌ నిర్లక్ష్యం కారణంగానే తమ బంధువు చనిపోయాడంటూ మృతుడి కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టిన సంఘటన ఆదివారం.  బోయిన్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బోయిన్‌పల్లికి చెందిన మధుసూదన్‌ గౌడ్‌ కడుపునొప్పితో బాధపడుతుండటంతో, కుటుంబ సభ్యులు అతడిని శనివారం స్థానిక వీఆర్‌ ఆసుపత్రిలో చేరి్పంచారు.

 ఆసుపత్రి సిబ్బంది సూచన మేరకు రాత్రి అక్కడే ఉంచారు. మర్నాడు ఉదయం మధుసూదన్‌ పరిస్థితి విషమించినట్లు చెప్పడంతో కుటుంబసభ్యులు అతడిని మరో ఆసుపత్రికి తీసుకెళతామని చెప్పారు. అయితే అందుకు నిరాకరించిన ఆసుపత్రి యాజమాన్యం ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం ఉదయం 10.00 గంటల సమయంలో మధుసూదన్‌ గౌడ్‌ మృతి చెందినట్లు చెప్పిన ఆసుపత్రి నిర్వాహకులు, అంబులెన్స్‌లో నేరుగా మృతదేహాన్ని అతడి ఇంటికి తరలించారు. మధుసూదన్‌గౌడ్‌ మృతిపై అనుమానం వ్యక్తం చేసిన బంధువులు, తిరిగి మృతదేహాన్ని  తీసుకువచ్చి ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. అర్హత, అనుభవం లేని  వైద్యుడితో చికిత్స చేయించారని ఆరోపిస్తూ ఆసుపత్రిపై దాడికి యతి్నంచారు.

 దీంతో అక్కడికి వచి్చన స్థానిక నాయకుడు ఆసుపత్రి యాజమాన్యం తరఫున బాధితులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేశాడు. దీంతో మరింత ఆగ్రహానికి లోనైన మృతుడి బంధువులు సదరు నేతపై దాడికి యత్నించారు. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన అతను అక్కడి నుంచి జారుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

మంత్రి ఆదేశాలతో...
మృతుడి బంధువులు ఈ విషయాన్ని జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి పొన్నం ప్రభాకర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని మంత్రి సూచించడంతో పోలీసులు, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తం అయ్యా రు. ఆదివారం ఉదయం ఆసుపత్రిని సందర్శించిన జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల బృందం మృతుడి చికిత్సకు సంబంధించిన రికార్డులు స్వాధీనం చేసుకున్నారు.  అతడికి చికిత్స చేసిన డాక్టర్‌ అర్హతతో పాటు మందుల వివరాలను సేకరించారు. అనుమతులకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు.  

 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?