Breaking News

గూడు లేక.. అద్దె ఇంటికి వెళ్లలేక

Published on Sun, 02/02/2025 - 14:00

ముస్తాబాద్‌(సిరిసిల్ల): గూడు లేక.. అద్దె ఇంటికి వెళ్లలేక.. మృతదేహంతో ఓ కుటుంబం రాత్రంతా అంబులెన్స్‌లో ఉన్న హృదయ విదారకర సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఖరీదైన వైద్యం పొందలేని నేత కార్మికుడు మృతిచెందగా.. భార్య ముగ్గురు పిల్లలతో కలిసి భర్త మృతదేహంతో రాత్రంతా చలిలోనే ఉండటం చూసి గ్రామస్తులు కంటతడి పెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. ముస్తాబాద్‌కు చెందిన బిట్ల సంతోష్‌(48) వార్పిన్‌ నేత కార్మికుడిగా పని చేసేవాడు. 

కేన్సర్‌తో బాధపడుతూ శుక్రవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబసభ్యులు అంబులెన్స్‌లో సిరిసిల్లకు తరలిస్తుండగా మార్గమ«ధ్యలో మృతిచెందాడు. అద్దె ఇంట్లో ఉంటూ భార్య శారద, ఇద్దరు కూతుళ్లు, కుమారుడిని పోషిస్తున్న సంతోష్‌ మృతితో వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. అతని మృతదేహాన్ని అద్దె ఇంటికి తీసుకెళ్లలేక పూర్తిగా శిథిలమైన తమ పూర్వీకుల ఇంటికి తీసుకెళ్లి, రాత్రంతా చలిలో ఉన్నారు. ఈ ఘటన సోషల్‌మీడియాలో వైరల్‌ అవడంతో తహసీల్దార్‌ సురేశ్, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు యెల్ల బాల్‌రెడ్డి, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ నాయకులు స్పందించారు. చందాలు పోగు చేశారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చారు.  

బాధిత కుటుంబానికి ఇల్లు..
నేత కార్మికుడు సంతోష్‌ కుటుంబ దీనగాథ తెలుసుకున్న కాంగ్రెస్‌ సిరిసిల్ల ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి విషయాన్ని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన.. బాధితులకు డబుల్‌ బెడ్‌రూం ఇల్లు ఇవ్వాలని తహసీల్దా ర్‌ సురేశ్, ఎంపీడీవో బీరయ్యలను ఆదేశించారు. వారు కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు బాల్‌రెడ్డి చేతులమీదుగా బాధిత కుటుంబానికి డబుల్‌ బెడ్‌రూం ఇంటి తాళాలు అందజేశారు. సంతోష్‌ కుటుంబానికి అండగా ఉంటామని, చిన్నారుల చదువులకు సహకరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.    

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)