Breaking News

కుటుంబంలో చీకట్లు నింపిన సంక్రాంతి

Published on Sat, 01/17/2026 - 13:15

కొమరంభీం జిల్లా: అందరి జీవితాల్లో సంక్రాంతి సంతోషాన్ని నింపగా.. ఓ కుటుంబంలో చీకటి అలుముకుంది. ఎదిగిన కొడుకు తమను పోషిస్తాడనుకున్న తల్లిదండ్రులకు తీరని విషాదం మిగిల్చింది. జీవితాంతం తోడుగా ఉంటానని హామీ ఇచ్చిన భర్త రెండు నెలలకే దూరమయ్యాడు. సంగారెడ్డి జిల్లా మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆసిఫాబాద్‌ జిల్లాకు చెందిన రాపర్తి సంతోష్‌(32) దుర్మరణం చెందాడు. కెరమెరి మండల కేంద్రానికి చెందిన రాపర్తి తిరుపతి–గుణసుందరి దంపతులకు ఇద్దరు కూతుర్లు, కొడుకు సంతోష్‌ సంతానం. అతనికి నవంబర్‌ 13న రెబ్బెనకు చెందిన శ్రావణితో వివాహమైంది. సంతోష్‌ తన భార్యతో సంగారెడ్డిలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు.

దైవ దర్శనానికి వెళ్లి..
సంక్రాంతి పండుగ సందర్భంగా నలుగురు స్నేహితులతో కారులో మెదక్‌లోని ఏడుపాయలు, దుర్గమ్మ ఆలయాలను దర్శించుకునేందుకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో సంగారెడ్డి సమీపంలోని పోతిరెడ్డిపల్లె వద్ద ఎదురొచ్చిన గేదెను తప్పించే క్రమంలో కారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొట్టింది. తర్వాత అది వరిపొలంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సంతోష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మిగిలినవారికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అతను ఇప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

భార్యను పుట్టింటికి పంపి..
పెళ్లయిన తర్వాత వచ్చిన తొలి పండుగ కావడంతో భార్యను నాలుగు రోజుల క్రితం పుట్టింటికి పంపించాడు. శుక్రవారం వచ్చి తీసుకెళ్తానని చెప్పాడు. అంతలోనే ప్రమాదంలో మరణించడంతో కుటుంబంలో విషాదం అలుముకుంది. గడిచిన క్షణాలను గుర్తుచేసుకుంటూ భార్య, తల్లిదండ్రులు, అక్కచెల్లెళ్లు రోదిస్తున్న తీరు కంటతడి పెట్టించింది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)