Breaking News

గొంతుకోసి..కత్తులతో పొడిచి..

Published on Sun, 04/20/2025 - 07:05

హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ కారణంగా చోటు చేసుకున్న వివాదం హత్యకు దారి తీసిన సంఘటన షాద్‌నగర్‌ శివారులో ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. శంషాబాద్‌ ఇన్‌చార్జి, రాజేంద్రనగర్‌ డీసీపీ సీహెచ్‌ శ్రీనివాస్‌ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. ఈ నెల 13న షాద్‌నగర్‌ లింగారెడ్డిగూడెం శివారులోని ఎంఎస్‌ఎన్‌ పరిశ్రమ సమీపంలో జాతీయరహదారి పక్కన కత్తిపోట్లకు గురైన గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని గుర్తించిన షాద్‌నగర్, శంషాబాద్‌ ఎస్‌ఓటీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

మృతుడి కుడి చేయిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా అతను  నంద్యాల జిల్లా, బండి ఆత్మకూరు మండలం, చిన్నదేవులాపురం గ్రామానికి చెందిన కిలారి సాయిరాహుల్‌(23) గుర్తించారు.  హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు పూర్తి చేసిన సాయి రాహూల్‌ ఉద్యోగం కోసం నగరానికి వచ్చాడు. 11 విన్నర్స్‌ అనే ఆన్‌లైన్‌ క్యాసినో బెట్టింగ్‌కు అలవాటు పడ్డాడు. 

ఈ క్రమంలో  నగరంలోని ఓ పీజీ హాస్టల్‌లో ఉంటున్న తన ఊరికే చెందిన  చిన్ననాటి స్నేహితుడు శాఖమురి వెంకటేష్‌కు కూడా బెట్టింగ్‌ అలవాటు చేశాడు. ఈ క్రమంలో వెంకటేష్‌ రూ.15 లక్షలు పోగొట్టుకున్నాడు. మూడు నెలల క్రితం కూడా సాయిరాహుల్‌ మరోమారు అదే గేమ్స్‌లో డబ్బులు పెట్టి తిరిగి సంపాదించుకుందామని చెప్పి వెంకటే‹Ùతో రూ. 3 లక్షలు బెట్టింగ్‌ పెట్టించాడు. అయితే డబ్బులు పోవడంతో వెంకటేష్‌ తనకు రూ. 3 లక్షలు ఇవ్వాలని సాయిరాహుల్‌పై ఒత్తిడి చేశాడు. దీంతో సాయిరాహుల్‌ తనను డబ్బులు అడిగితే చంపేస్తానని బెదిరించాడు.  

భయంతోనే హత్యకు కుట్ర.. 
గతంలోనూ ఓ మారు సాయిరాహుల్‌ రూ. 20 వేల విషయమై వెంకటేష్‌పై బీరుబాటిల్‌తో దాడి చేశాడు. ఆ తర్వాత తిరిగి స్నేహితులయ్యారు. సాయి తనను హత్య చేస్తాడనే భయంతో వెంకటేష్‌ తనతో కలిసి హాస్టల్‌లో ఉంటున్న స్నేహితులతో  కలిసి సాయిని అంతమొందించాలని పథకం వేశాడు. ఇందుకు రూ. 2 లక్షలు ఇస్తానని చెప్పి కొంత అడ్వాన్స్‌గా ఇచ్చాడు. దీంతో వారు సురారం వెళ్లి కత్తులు కొనుగోలు చేసి అద్దెకారు తీసుకున్నారు. 

ఈ నెల 12 సాయిని బెట్టింగ్‌ పేరుతో లింగారెడ్డిగూడెం రప్పించారు. అతడికి మద్యం తాగించి గొంతుకోయడంతో పాటు కత్తులతో విచక్షణ రహితంగా పొడిచి హత్య చేశారు. అనంతరం బహదూర్‌పల్లి  గండిమైసమ్మ సమీపంలోని బంధువుల ఇంట్లో తలదాచుకుని అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. కేసు దర్యాప్తులో భాగంగా ప్రధాన నిందితుడు వెంకటేష్‌  శనివారం ఉదయం ఆ«రాంఘర్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు. మిగతా నలుగురు నిందితులతో పాటు కారును అద్దెకిచ్చిన వ్యక్తి పరారీలో ఉన్నారు. నిందితుడి నుంచి  మూడుఫోన్లు, కారు స్వా«దీనం చేసుకున్నారు. కేసును చేధించిన షాద్‌నగర్‌ సీఐ విజయ్‌కుమార్, ఎస్‌ఓటీ పోలీసులను డీసీపీ అభినందించారు.  

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)