Breaking News

వివాహేతర సంబంధం.. శైలజ నుంచి ఫోన్‌ వచ్చిందని..!

Published on Tue, 04/29/2025 - 11:35

పెద్దపల్లిరూరల్‌: అక్రమసంబంధం నేపథ్యంలో అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. తన భార్యతో సన్నిహితంగా మెలగడాన్ని జీర్ణించుకోలేక.. ఈ విషయమై కొంతకాలంగా సదరు యువకుడితో గొడవ జరుగుతున్నా.. అతడిలో మార్పు రాకపోవడం.. తను కాదంటున్న వెంట పడుతున్నాడంటూ భార్య చెప్పడంతో రగిలిపోయిన భర్త.. మాట్లాడుకుందాం రా.. అని పిలిచి కిరాతకంగా చంపేశాడు. 

పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన పొలం కుమార్‌(35) తన భార్య అనిత, ముగ్గురు పిల్లలతో పెద్దపల్లిలోనే నివాసముంటూ ట్రాక్టర్‌ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అలాగే ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామానికి చెందిన వేల్పుల సంతోష్‌కుమార్‌కు కుమార్‌ భార్య అనిత పినతల్లి కూతురు శైలజతో పెళ్లయింది. వరసకు మరదలు అయ్యే శైలజతో కుమార్‌ చనువుగా మెదలుతుండడాన్ని సంతోష్‌ తట్టుకోలేక పోయాడు. 

ఈ విషయమై కుమార్‌తో గొడవకు దిగాడు. కొంతకాలంగా గొడవలు జరుగుతున్నా కుమార్‌ ప్రవర్తనలో తేడా కనిపించలేదు. తన భార్య శైలజను నిలదీయడంతో తను కాదంటున్న వెంటపడుతూ వేధిస్తున్నాడంటూ చెప్పడంతో సంతోష్‌లో కోపం ఉగ్రస్థాయికి చేరింది. ఈక్రమంలో సోమవారం సంతోష్‌ ‘మాట్లాడుకుందాం రా’ అని కుమార్‌ను పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు పిలిచాడు. మార్కెట్‌ యార్డు ఆవరణలో తన భార్య, అక్కడున్నవారు చూస్తుండగానే కుమార్‌ను సంతోష్‌ కత్తితో నరికిచంపాడు. ఘటన స్థలాన్ని డీసీపీ కరుణాకర్, సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సైలు లక్ష్మణ్‌రావు, మల్లేశ్‌ పరిశీలించారు.

రమ్మని పిలిచి చంపేశారు..
పొలం కుమార్‌ ఇంట్లో ఉండగా సంతోష్‌కుమార్, శైలజ నుంచి ఫోన్‌ వచ్చిందని మృతుడి భార్య అనిత తెలిపింది. వెంటనే బయటకు వెళ్తుండగా ఎక్కడికి అని అడిగితే ‘సంతోష్, శైలజ తనతో మాట్లాడుతారట. వ్యవసాయ మార్కెట్‌యార్డుకు రమ్మంటున్నారు’. అని బయటకు వెళ్లి ఇలా ప్రాణాలు కోల్పోయాడని రోదించింది. శైలజ తన భర్తతో చనువుగా ఉంటూ తన తప్పును కప్పి పుచ్చుకునేందుకు వెంట పడుతున్నాడంటూ చెప్పి కోపం పెరిగేలా చేసిందని పేర్కొంది. అక్రమసంబంధం ఉందనే అనుమానంతో తన భర్తను దారుణంగా చంపారని విలపించింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు విచారణ జరుపుతున్నట్లు సీఐ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.
 

Videos

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

జోగి రమేష్ హౌస్ అరెస్ట్

ఆ 15 స్థానాల్లో పోటీయే లేదు..! లైవ్ లో మొత్తం బయటపెట్టిన YS జగన్

Photos

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)