వ్యక్తి దారుణ హత్య

Published on Mon, 07/14/2025 - 08:45

మేడ్చల్‌రూరల్‌: భార్యాభర్తలు ఓ వ్యక్తిని కొట్టి చంపిన సంఘటన మేడ్చల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్‌ చెందిన ఎదునూరి నరసింహ అలియాస్‌ చిన్న, తన భార్య అనితతో కలిసి మేడ్చల్‌ మున్సిపాలిటీ పరిధిలోని చెక్‌పోస్ట్‌లో ఉంటూ రోడ్డు పక్కన కాగితాలు, ప్లాస్టిక్‌ వస్తువులను సేకరించి, అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు.

మెదక్‌ జిల్లా, తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన నర్సింలు (37) శనివారం మధ్యాహ్నం మేడ్చల్‌ చెక్‌పోస్ట్‌లోని వెంటకరమణ లిక్కర్‌ ల్యాండ్‌ వద్ద మద్యం తాగుతుండగా చిన్న, అతడి భార్య అనితతో స్క్రాప్‌ విషయమై గొడవ జరిగింది. దీంతో వారిద్దరూ కలిసి నర్సింహులును కర్రలతో కొట్టడంతో తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. 

రాత్రి దీనిని గుర్తించిన వైన్‌ షాప్‌ నిర్వాహుకుడు మహేష్‌ మేడ్చల్‌ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)