Breaking News

డామిట్‌.. కథ అడ్డం తిరిగింది!

Published on Mon, 02/03/2025 - 07:09

ఘట్‌కేసర్‌ (మల్కాజ్‌గిరి జిల్లా) : కూతురును ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించాలని ఓ తల్లి ఆడిన డ్రామాను ఘట్‌కేసర్‌ పోలీసులు ఛేదించారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఘట్‌కేసర్‌ మండలం అవుషాపూర్‌ గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలి (60) కూతురు ఆర్థిక సమస్యల్లో ఉంది. కూతురు పడుతున్న కష్టాలను గమనించిన తల్లి.. ఏదైనా సాయం చేయాలనుకుంది. తన దగ్గర డబ్బు లేకపోవడంతో పుస్తెల తాడు విక్రయించాలనుకుంది. 

బంగారం అమ్మితే కుమారుడికి తెలుస్తుందని భయపడి మిన్నకుండిపోయింది. ఎలాగైనా కూతురికి  సాయం చేయాలని చైన్‌ స్నాచింగ్‌ డ్రామాకు తెరలేపింది. ఆదివారం ఉదయం ఇంటి నుంచి మెయిన్‌ రోడ్డుకు చేరుకొని తన మెడలోని మూడు తులాల బంగారు పుస్తెల తాడును గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారని ఏడ్వసాగింది. దీంతో పలువురు స్థానికులు అక్కడ గుమికూడారు. ఈ క్రమంలో వృద్ధురాలు డయల్‌ 100కు ఫోన్‌ చేసింది. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, నలుగురు ఎస్సైలు పోలీస్‌ సిబ్బందితో కలిసి నాలుగు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. 

దర్యాప్తులో భాగంగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వృద్ధురాలు పొంతన లేని సమాధానాలు చెప్పింది. పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించగా దుండగుల ఆచూకీ  లభించలేదు. దీంతో వృద్ధురాలిని గట్టిగా నిలదీయడంతో.. కూతురిని ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించాలని డ్రామా ఆడినట్లు తెలిపింది. కూతురి ఆర్థిక సమస్యలు తీర్చాలని పోలీసులను తప్పుదోవ పట్టించిన వృద్ధురాలిపై చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. అత్యవసర సమయాల్లో వినియోగించే డయల్‌ 100ను దుర్వానియోగపర్చవద్దని పోలీసులు సూచించారు.  

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)