Breaking News

హైదరాబాద్‌లో రద్దయిన కరెన్సీ కలకలం

Published on Mon, 03/17/2025 - 08:37

హైదరాబాద్‌: రద్దయిన పాత నోట్లు నగరంలో కలకలం రేపాయి. వీటిని మార్పిడి చేసేందుకు యత్నిస్తున్న నిందితులను సెంట్రల్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్న ఘటన ఆదివారం అబిడ్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లంగర్‌హౌజ్‌కు చెందిన సయ్యద్‌ ముజమ్మిల్‌ హుస్సేన్‌  టెంట్‌హౌస్‌ నడుపుతూ రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేసేవాడు. 

ఆ తర్వాత 2006లో సౌదీ అరేబియా వెళ్లి  2019లో తిరిగి వచ్చాడు. ఆ మధ్యకాలంలో అతడు ఆదాయ పన్నును ఎగవేసేందుకు పాత కరెన్సీని పెద్ద ఎత్తున దాచిపెట్టాడు. దాన్ని మార్పిడి చేసేందుకు అప్పట్లో అనేక ప్రయత్నాలు చేసినా సఫలం కాలేదు. ఇటీవలి కాలంలో మళ్లీ నోట్ల మార్పిడికి ప్రయత్నాలు ప్రారంభించాడు. ఆ తర్వాత అతడి సహచరుడు అమ్జద్‌ఖాన్‌ మధ్యవర్తుల ద్వారా పాతనోట్ల మారి్పడికి  ప్రయత్నించారు. 

ఇందుకోసం లంగర్‌హౌజ్‌కు చెందిన అహ్మద్‌ఖాన్, పాల్తీ భాస్కర్‌రావు, షేక్‌ నసీమాలతో పరిచయం చేసుకున్నారు. వీరికి 5 శాతం కమీషన్‌ ఇస్తామని అంగీకరించి మార్కెట్లో కస్టమర్ల కోసం వెతుకుతున్నారు. ఈ నెల 15న అబిడ్స్‌లోని తాజ్‌మహల్‌ హోటల్‌ వద్ద రద్దయిన కరెన్సీని మార్చేందుకు ప్రయతి్నస్తూ పట్టుబడ్డారు. వీరి నుంచి మొత్తం రూ.55,52,500 విలువైన పాత కరెన్సీ నోట్లు, 4 సెల్‌ఫోన్లను అబిడ్స్‌ పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. దాడిలో పాల్గొన్న సెంట్రల్‌జోన్‌ టాస్‌్కఫోర్స్‌ సిబ్బందిని డీసీపీ వైవీఎస్‌ సు«దీంద్ర అభినందించారు.   

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)