Breaking News

సంతానం లేని వారికి ఒయాసిస్ ఫెర్టిలిటీ ఓ వరం

Published on Mon, 11/25/2024 - 15:59

హనుమకొండ : సంతానం లేని దంపతులకు సంతాన భాగ్యం కల్పిస్తూ వారి కళ్ళల్లో ఆనందాన్ని అందిస్తుంది ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ అని డాక్టర్ జలగం కావ్య రావు అన్నారు. హనుమకొండ బ్రాంచ్ మొదటి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ కావ్య రావు, డాక్టర్ కృష్ణ చైతన్య, డాక్టర్ అంజనీ దేవి, డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ భోజరాజు రోహిత్, డాక్టర్ ప్రసన్నలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా డాక్టర్ కావ్య రావు మాట్లాడుతూ భారతదేశంలోనే ప్రముఖ ఫెర్టిలిటీ కేర్ ప్రొవైడర్ అయిన ఒయాసిస్ ఫెర్టిలిటీ, హన్మకొండ ఫెర్టిలిటీ సెంటర్, 2017 నుండి ప్రజలకు సేవలందిస్తున్న వరంగల్ శాఖ వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూతన మొదటి వార్షికోత్సవాన్ని వేడుకగా చేసుకుంది. జంటలు సంతానోత్పత్తి సవాళ్లను అధిగమించడానికి, అధునాతన, సైన్స్ ఆధారిత చికిత్సల ద్వారా వారి తల్లిదండ్రులవ్వాలనే వారి కలలను నెరవేర్చుకోవడానికి ఒయాసిస్ ఫెర్టిలిటీ తిరుగులేని నిబద్ధతను ఈ మైలురాయి చాటిచెబుతుంది. ఒయాసిస్ ఫెర్టిలిటీ కోఫౌండర్  మెడికల్ డైరెక్టర్ డాక్టర్ దుర్గా జి. రావు, కిరణ్ లకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

 ఒయాసిస్ ఫెర్టిలిటీ సైన్ టిఫిక్హెడ్, క్లినికల్ ఎంబ్రియాలజిస్ట్ డాక్టర్ కృష్ణ చైతన్య మంత్రవాది గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒయాసిస్ ఫెర్టిలిటీ సైన్ టిఫిక్ హెడ్ అండ్ క్లినికల్ ఎంబ్రియాలజిస్ట్ డాక్టర్ కృష్ణ చైతన్య మంత్రవాది మాట్లాడుతూ ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా తల్లిదండ్రులవ్వాలనే కలను సాధించడంలో ఎన్నో జంటలకు సహాయం చేశాం. 

అంతేగాకుండా, మా ఫెర్టిలిటీ కేర్ సేవలు ఎగ్, మరియు స్పెర్మ్ ఫ్రీజింగ్ వసతి ద్వారా భార్య భర్తలు లేదా నేటి తరం వారు వారి భవిష్యత్తు కోసం సంతానోత్పత్తిని కాపాడుకునే ఎంపికను అందించడం ద్వారా కుటుంబ ప్రణాళిక గురించి అవగాహనతో కూడిన నిర్ణయాలు తీసుకునేలా వారికి సాధికారికత ఇస్తాయి అని అన్నారు. వయస్సు, మెడికల్ హిస్టరీ, జీవనశైలికి సంబంధించిన అనుకూలీకరించిన సంతానోత్పత్తి పరిష్కారాలను అందించడం ద్వారా హన్మకొండ కేంద్రం ఒక సంవత్సరంలోపుగానే ఫెర్టిలిటీ వైద్యంలో అగ్రగామిగా మారింది. 

ఈ మైలురాయి సాధించడంపై ఒయాసిస్ ఫెర్టిలిటీ రీజినల్ మెడికల్ హెడ్  ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ జలగం కావ్యరావు మాట్లాడుతూ హన్మకొండలోని ఒయాసిస్ ఫెర్టిలిటీ ప్రారంభమైనప్పటి నుండి ప్రపంచ స్థాయి సంతానోత్పత్తి చికిత్సలకు మాత్రమే కాకుండా పునరుత్పత్తి ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడానికి కట్టుబడి ఉంది. ఈ చికిత్సల్లో 70% విజయం సాధించడం మా క్లినికల్ నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఇప్పటివరకు సుమారు 6000 మంది జంటలకి సంతాన సాఫల్యత అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వైయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా సంతానం పొందిన ఆయా దంపతుల కుటుంబాలు పిల్లలు హాజరవ్వడంతో వారి అనుభవాలను ఆనందాన్ని అందరితో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ వైద్యులు సిబ్బంది, పిల్లలు, తల్లి తండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)