Breaking News

అవగాహన లేమితోనే రోడ్డు ప్రమాదాలు

Published on Wed, 01/24/2024 - 04:29

సాక్షి, హైదరాబాద్‌: వాహనదారుల్లో అవగాహన లేమితోనే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగు తున్నాయని, అవగాహన పెంచే కార్యక్రమా లపై అధికారులు దృష్టి పెట్టాలని డీజీపీ రవిగుప్తా సూచించారు. రోడ్డు ప్రమాదంలో ఎక్కువగా యువత చనిపోతున్నందున ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎడ్యుకేషన్, ఎమర్జెన్సీ, రోడ్‌ ఇంజనీరింగ్‌ వ్యూహాలతో రోడ్డు ప్రమాదాలను నియంత్రించాల్సిన అవసరముందని  అభిప్రాయపడ్డారు. జనవరి 15వ తేదీ నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు రోడ్డు భద్రత మాసంగా కేంద్ర రోడ్డు రవా ణా, జాతీయ రహదారుల శాఖ ప్రకటించిన నేపథ్యంలో రోడ్డు భద్రత మాసం నిర్వహణపై రవిగుప్తా మంగళవారం డీజీపీ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో వీడి యో కాన్ఫరెన్స్‌ ద్వారా పలు సూచనలు ఇచ్చారు.

ఈ కాన్ఫరెన్స్‌లో రవాణాశాఖ కమిషనర్‌ బుద్ధ ప్రకాష్, రోడ్డు భద్రత, రైల్వేల విభాగపు అడిష నల్‌ డీజీపీ మహేష్‌భగవత్, హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ రెడ్డి,  డీఐజీ రంగనాథ్, రోడ్‌ సేఫ్టీ ఎస్పీ సందీప్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లా డుతూ 2022లో తెలంగాణలో 7,500 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోగా, దేశవ్యాప్తంగా 1,68,000 మంది మృత్యువాత పడినట్టు గణాంకాలు చెబుతున్నాయన్నారు. హెల్మెట్‌ ధరించకపోవడం, సీటు బెల్ట్‌ పెట్టుకోకపోవడం, ఓవర్‌ స్పీడ్, డేంజరస్‌ డ్రైవింగ్, మొబైల్‌ ఫోన్‌ మాట్లా డుతూ డ్రైవింగ్‌ చేయడం తదితర కారణాలతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నా యన్నారు. ఈ ఉల్లంఘనలపై పోలీస్‌ ఉన్నతాధి కారులు దృష్టి పెట్టాలని సూచించారు.

రహదా రులు ఉండే ప్రాంతాల్లో రోడ్‌ సేఫ్టీ క్లబ్‌లు  ఏర్పాటు చేయాలని, పోలీస్‌ కార్యాలయంలో డిస్ట్రిక్‌ రోడ్‌ సేఫ్టీ బ్యూరో,  కమిషనరేట్‌ రోడ్‌ సేఫ్టీ బ్యూరో ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. అవస రమైతే ఈ–చలాన్‌ నిధుల ద్వారా స్పీడ్‌ గన్స్‌ బ్రీత్‌ అనలైజర్స్‌  కొనుగోలు చేసే అవకాశాలను పరిశీ లించాలన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలను కాపాడే వారికి ‘గుడ్‌ సమారిటన్‌’ పేరిట సన్మా నం చేయాలని డీజీపీ అన్నారు. ఈ చర్యలు ఈ నెలకే పరిమితం కాకుండా దీర్ఘకాలంలోనూ అనుసరించాలని పోలీసు అధికారులకు డీజీపీ రవిగుప్తా స్పష్టం చేశారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)