Breaking News

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్‌

Published on Fri, 01/12/2024 - 20:24

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ప్రక్షాళనకు అడుగులు పడ్డాయి. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈనెల 18వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేసింది. అర్హులైన అభ్యర్థులు www.telangana.gov.in వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తు నమూనా పత్రాలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించింది.

కాగా, దాదాపు నెలరోజులుగా పెండింగ్‌లో ఉన్న చైర్మన్‌ జనార్ధన్‌రెడ్డి, సభ్యుల రాజీనామాలకు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ బుధవారం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. టీఎస్‌పీఎస్సీలో చైర్మన్‌తో పాటు 10 సభ్యులుంటారు. కానీ గత ప్రభుత్వం చైర్మన్, ఆరుగురు సభ్యులను మాత్రమే నియమించింది.

వీరిలో ఒక సభ్యుడు పదవీ విరమణ పొందగా..ఐదుగురు కొనసాగుతూ వచ్చారు. అయితే ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం, కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో చైర్మన్‌ బి.జనార్దన్‌ రెడ్డి, సభ్యులు ఆర్‌.సత్యనారాయణ, ప్రొఫెసర్‌ బండి లింగారెడ్డి, కె.రవీందర్‌ రెడ్డి రాజీనామాలు సమర్పించారు.

రాజీనామాలను గవర్నర్‌ ఆమోదించిన మరుక్షణమే టీఎస్‌పీఎస్సీకి కొత్త చైర్మన్, సభ్యులను నియమిస్తామని డిసెంబర్‌ 27న సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం నియామకాలు చేపడ్తామని, నిరుద్యోగులెవరూ ఆందోళనకు గురికావద్దని అన్నారు. తాజాగా నియామక ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం టీఎస్‌పీఎస్సీ పరిధిలో దాదాపుగా అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయి.

ఇదీ చదవండి: సంక్రాంతి ఎఫెక్ట్: విజయవాడ హైవేపై కదలని వాహనాలు

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)