Breaking News

సీఎం రేవంత్‌పై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం

Published on Mon, 09/02/2024 - 09:03

సాక్షి,న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమవారం(సెప్టెంబర్‌2) ఓటుకు నోటు కేసు విచారణ సందర్భంగా  రేవంత్‌రెడ్డి వైఖరిని సుప్రీంకోర్టు మరోసారి తప్పుపట్టింది.  లిక్కర్‌ కేసులో కవితకు బెయిల్‌ ఇవ్వడంపై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను పిటిషనర్‌ లాయర్స్‌ మరోసారి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 

తెలంగాణ పీసీసీ ట్విటర్‌ హ్యాండిల్‌లోనే కవిత బెయిల్‌పై పోస్టులు పెట్టిన విషయాన్నికోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ‘బెయిల్‌ గ్రాంటెడ్‌.. బెయిల్‌ గివెన్‌..? అని పోస్టులు పెట్టినట్లు తెలిపారు. సీఎం రేవంతే పీసీసీ చీఫ్‌గా ఉన్నారని కోర్టుకు విన్నవించారు. దీనిపై జస్టిస్‌ బిఆర్‌ గవాయి, జస్టిస్‌ కెవి విశ్వనాథన్‌ ధర్మాసనం స్పందింంది. 

 ఈ పోస్టులను కోర్టు దృష్టికి తేవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

‘ఉన్నత స్థానాలలో ఇలా వ్యవహరించడం మంచిది కాదు. లాయర్లను, జడ్జిలను రాజకీయాల్లోకి లాగడం సరికాదు. న్యాయ వ్యవస్థగా మీ నుంచి  గౌరవాన్ని ఆశిస్తున్నాం’అని రేవంత్‌ను ఉద్దేశించి ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో రేవంత్‌ ఇప్పటికే క్షమాపణలు చెప్పారని ఆయన తరపు న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా కోర్టుకు తెలిపారు. దీనికి స్పందించిన బెంచ్‌ రిప్లై ఫైల్‌ చేయాలని రేవంత్‌ న్యాయవాదిని ఆదేశించింది. కాగా, ఓటుకు నోటు కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు