Breaking News

Hyderabad: ‘లోకల్‌’ అంత ఈజీ కాదు

Published on Tue, 05/21/2024 - 08:02

సాక్షి, హైదరాబాద్‌: స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరుగుతాయనే వార్తల నేపథ్యంలో క్షేత్రస్థాయిపై బీజేపీ దృష్టి సారించింది.  తొలుత గ్రామపంచాయతీ, ఆ తర్వాత జిల్లా, మండల పరిషత్‌లకు, ఈ ఏడాది చివర్లోగా మున్సిపాలి టీలు, కార్పొరేషన్లకు వరుసగా ఎన్నికలు జరుగు తాయి. అయితే గ్రామస్థాయిలో వార్డు సభ్యులు, మొదలుకొని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీ సీలు, మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు ఇలా ప్రతి చోట అభ్యర్థి ఎంపికనే కీలకం. 

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో పార్టీకి పడిన ఓట్లు, ఆయా పోలింగ్‌ బూత్‌లలో బీజేపీకి పోలైన ఓట్ల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక, టికెట్ల కేటాయింపుపై పూర్తిస్థాయి దృష్టి పెడతారని పార్టీవర్గాల సమాచారం. కొంతకాలంగా పార్టీ కోసం పనిచే స్తుండడంతోపాటు, ప్రజల్లో ఉన్న గుర్తింపు, వివిధ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రయత్నా లు, ఆయా ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు సాధించిన ఓట్లు ప్రామాణికంగా మారనున్నట్టు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి, వివిధ వర్గాల ఓట్ల సాధనకు ఏ మేరకు సఫలమయ్యా రనే దాని ప్రాతిపదికన  స్థానిక సంస్థల టికెట్లు కేటాయిస్తామని పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీలో ఇంతకాలంగా ఉన్నాం.. ఇంత పనిచేశాం..అంత పనిచేశామనే ప్రచారానికి పరిమితం కాకుండా గ్రౌండ్‌లెవల్‌లో పార్టీ ఫలితాల సాధన కు ఏ మేరకు వారి కృషి ఉందనే అంశాన్ని  నాయ కత్వం బేరీజు వేయనున్నట్టు తెలుస్తోంది. 

వివిధ స్థాయిల్లో పార్టీ అభ్యర్థులు మంచి ప్రదర్శన కన బరచడంలో స్థానిక నేతల కృషి, సాధించిన ఫలి తాలు కొలమానం చేయడం ద్వారా నాయకులు, కార్యకర్తల్లో మరింత అంకితభావం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. వచ్చే 2,3 నెలల్లో గ్రామీణ, ఆ తర్వాత మున్సిపాలిటీల ఎన్నికలు జరగొచ్చన్న అంచనాల మధ్య పార్టీలో స్థానికంగా వివిధస్థాయిలో అభ్యర్థుల ఎంపిక కసరత్తు అనేది కూడా త్వరలోనే మొదలు మొదలవుతుందని సమాచారం. జూన్‌ 4న లోక్‌సభ ఎన్నికల ఫలి తాలు వెలువడ్డాక, పార్లమెంట్‌ పరిధిలోని అసెంబ్మీ సెగ్మెంట్లు, పోలింగ్‌బూత్‌ల వారీగా పార్టీకి పడి న ఓట్ల వివరాలు వెల్లడయ్యాక ఈ ప్రక్రియ వేగం పుంజుకుంటుందని పార్టీనేతలు చెబుతున్నారు.    

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)