Breaking News

ఆ పథకం ‘గ్యాసే’నా!

Published on Tue, 10/15/2024 - 09:40

సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రూ.500కే వంట గ్యాస్‌ సిలిండర్‌ పథకం అర్హులైన నిరుపేద కుటుంబాలకు సైతం అందని ద్రాక్షగానే తయారైంది. ఒక  కుటుంబం రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌కు అర్హత సాధించినా.. వంట గ్యాస్‌ సబ్సిడీ మాత్రం వర్తించకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. లబి్ధదారులు కలెక్టరేట్‌ ప్రజాపాలన కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేసి దరఖాస్తులు సవరించుకున్నప్పటికీ ఫలితం మాత్రం దక్కడం లేదు. ఇటు పౌరసరఫరాల శాఖ కానీ, అటు ఆయిల్‌ కంపెనీల గ్యాస్‌ ఏజెన్సీలు కూడా దీనిపై స్పష్టత ఇవ్వడం లేదు. ఫలితంగా నిరుపేదలు నిరాశకు గురవుతూ.. ఎప్పటి మాదిరిగానే బహిరంగ మార్కెట్‌ ధర చెల్లించి వంట గ్యాస్‌ సిలిండర్‌ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.  

ప్రజాపాలనలో.. 
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీల వర్తింపు కోసం సరిగ్గా తొమ్మిది నెలల క్రితం ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులు స్వీకరించి బీపీఎల్‌ కుటుంబాలను గుర్తించింది. అన్ని పథకాలకు తెల్లరేషన్‌ కార్డును ప్రామాణికంగా తీసుకున్నారు. అర్హత సాధించిన కుటుంబాలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌ వర్తింపజేశారు. కానీ, సగానికి పైగా కుటుంబాలు కేవలం ఉచిత విద్యుత్‌ వర్తింపునకు పరిమితమయ్యాయి. సబ్సిడీ గ్యాస్‌ మాత్రం అందడం లేదు. 

ఇదీ పరిస్థితి 
గ్రేటర్‌ హైదరాబాద్‌ అర్బన్‌ పరిధిలో అధికారికంగా గృహోపయోగ వంటగ్యాస్‌ కనెక్షన్‌ కలిగిన కుటుంబాలు 30.18 లక్షలకు పైనే ఉన్నాయి. అందులో 20 శాతం మినహా మిగతా 80 శాతం కుటుంబాలు మ హాలక్ష్మి పథకం కింద రూ. 500కు వంట గ్యాస్‌ సిలిండర్ల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో కనీసం పది శాతం దరఖాస్తుదారులకు కూడా గ్యాస్‌ సబ్బిడీ వర్తించలేదు. 

పరిష్కారమేదీ? 
గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాల ఫలాలు వర్తించని కుటుంబాల కోసం దరఖాస్తు సవరణ (ఎడిట్‌) కోసం కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రాలు సమస్యకు పరిష్కారం చూపడం లేదు. ఈ కేంద్రాల్లో పథకాలు వర్తించని దరఖాస్తుదారులు రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డు గ్యాస్‌కనెక్షన్‌ నెంబర్, ఎల్పీజీ కస్టమర్‌ ఐడీ, మొబైల్‌ నెంబర్లను సవరించుకునే వెసులుబాటు ఉంది. దీంతో సేవా కేంద్రాలకు క్యూ కట్టి దరఖాస్తులను సవరించుకుంటున్నా.. సమస్యకు పరిష్కారం లభించడం లేదని నిరుపేదలు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అర్హులైన వారికి గ్యాస్‌ సబ్సిడీ వర్తింపజేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)