Breaking News

తెలంగాణ విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్‌

Published on Tue, 07/01/2025 - 18:31

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ప్రొఫెషనల్‌ కాలేజీల్లోని అన్ని కోర్సుల ట్యూషన్‌ ఫీజులపై సర్కారు స్పష్టత ఇచ్చింది. 2025–26 విద్యా సంవత్సరంలో పాత ఫీజులే ఉంటాయని వెల్లడించింది. బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు 2022–25 బ్లాక్‌ పీరియడ్‌ ఫీజులే ఈ ఏడాది అమలవుతాయని ఉత్తర్వులు జారీ చేసింది. 2025–28 (మూడేళ్లు) బ్లాక్‌ పీరియడ్‌లో ఫీజుల సవరణకు తెలంగాణ అడ్మిషన్‌ అండ్‌ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్సీ) కాలేజీల వారీగా ప్రతిపాదనలు స్వీకరించి, ప్రత్యక్ష విచారణలు జరిపింది. అనంతరం ఫీజులను కూడా ఖరారు చేసింది.

అయితే ఫీజులను అధికారికంగా ధ్రువీకరిస్తూ జీవో జారీ చేయాల్సిన తరుణంలో ప్రభుత్వం ఫీజుల సవరణకు బ్రేకులు వేసింది. కొన్ని కాలేజీల్లో ఫీజులు ఆసాధారణంగా పెరగడంపై సర్కారు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. వ్యత్యాసం భారీగా ఉండటం, సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు, నిబంధనలు, ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నట్టు గుర్తించింది. దీంతో ఫీజుల సవరణను నిలిపివేసింది.

ఇక ఫీజులపై త్వరలోనే ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఈ కమిటీ ఫీజుల ఖరారును పరిశీలిస్తుందని, సవరణను సూచిస్తుందని, ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఫీజులను ఈ కమిటీ పరిశీలిస్తుందని సర్కారు వెల్లడించింది. వీటితోపాటు హైకోర్టు, సుప్రీంకోర్టుల ఆదేశాల మేరకు ఫీజుల సవరణపై ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు సర్కారు తెలిపింది.

చ‌ద‌వండి: జూనియ‌ర్ డాక్ట‌ర్ల స్టైపెండ్‌ పెంపు

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)