Breaking News

6ఏళ్ళ ప్రేమ.. మోసం చేసిన ప్రియురాలు

Published on Sat, 11/29/2025 - 07:44

మోర్తాడ్‌(బాల్కొండ): నిజామాబాద్‌ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్‌ వద్ద పోలీసు వాహనంపై శవం ఉన్న ఫ్రీజర్‌ను ఎక్కించి నిరసన తెలిపారు. ఆత్మ హత్యకు పాల్పడిన యువకుని కేసులో.. పోలీసులు నిందితులపై సరైన చర్యలు తీసుకోవడం లేదని నిరసిస్తూ చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దోంచంద గ్రామానికి చెందిన నాగిరెడ్డి శ్రీకాంత్‌ (29) యూకేలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు. పెళ్లి చేసుకోడానికి ఇటీవలే ఇంటికి వచ్చాడు.

 తనను వివాహం చేసుకోవాల్సిన అమ్మాయి.. ఆమె తల్లిదండ్రుల సూచనతో ఈనెల 7న మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లికి ఒకరోజు ముందే శ్రీకాంత్‌ పురుగు మందు తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు ఏర్గట్ల పోలీసులకు ఫిర్యాదు చేసి యువకుడిని హైదరాబాద్‌ తరలించగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురు వారం రాత్రి మరణించాడు. మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన కుటుంబ సభ్యు లు.. శుక్రవారం శ్రీకాంత్‌ ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు దోంచందలో బందోబస్తును ఏర్పాటు చేశారు. 

ఆగ్రహించిన గ్రామస్తులు యువకుని మృతదేహంతో దోంచంద నుంచి ఏర్గట్ల వరకు ర్యాలీగా బయలు దేరారు. పోలీసులు తాళ్లరాంపూర్‌ వద్దనే అడ్డుకోవడంతో పోలీసు వాహనంపై శవం ఉన్న ప్రీజర్‌ను ఎక్కించి నిరసన తెలిపారు. కొద్ది సేపటి తర్వాత మృతదేహంతో ఏర్గట్ల వరకూ చేరుకుని బస్టాండ్‌ సమీపంలో రాస్తారోకో నిర్వహించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని, నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆర్మూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)