Breaking News

చిరుతలను చంపిన వ్యక్తుల అరెస్టు

Published on Fri, 07/17/2026 - 04:14

నిజామాబాద్‌ అర్బన్‌: నిజామాబాద్‌ జిల్లాలో రెండు చిరుతలను చంపిన పదిమందిని అరెస్టు చేసినట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు. గురువారం ఆయన నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. భీమ్‌గల్‌ మండలం తాళ్లపల్లి గ్రామానికి చెందిన మాలవత్‌ సంజీవ్‌ నెలక్రితం తన మేకల మందను అడవికి తీసుకువెళ్లగా చిరుత దాడిచేసి మేకను చంపింది. ఈ విషయం దేవక్కపేట గ్రామానికి చెందిన సిరిసిల్ల రాములు తెలుసుకుని సంజీవ్‌తో మాట్లాడాడు. చిరుతను చంపి దాని శరీర భాగాలు అమ్ముకుంటే లక్షల రూపాయలు వస్తాయని ఆశచూపాడు. 

అనంతరం సంజీవ్‌ మేక కళేబరంలోకి సిరంజీ ద్వారా గడ్డిమందును ఎక్కించాడు. దానిని తిని చిరుత చనిపోయింది. సంజీవ్, రాములుతోపాటు మరో నలుగురు వ్యక్తులు కలిసి దాని కళేబరాన్ని దాచిపెట్టి కొనుగోలుదారులు దొరికిన తర్వాత అమ్ముకుందామని నిర్ణయించారు. అయితే చిరుత కళేబరాన్ని అటవీ అధికారులు గుర్తించి విచారణ చేపట్టగా.. సిరిసిల్ల రాములు ఇంట్లో నాటు తుపాకీ లభించింది. చిరుతను చంపినట్లు నిందితులు ఒప్పుకున్నారని, దీంతో సంజీవ్, రాములును రిమాండ్‌కు తరలించామని సీపీ తెలిపారు.  

ఇందల్వాయి ప్రాంతంలో మరో చిరుతను.. 
నిజామాబాద్‌ అటవీ డివిజన్‌ పరిధిలోని ఇందల్వాయి అటవీ క్షేత్రం అన్సన్‌పల్లి బీట్‌ పరిధిలో మూడు నెలల క్రితం చిరుతను వేటాడి చంపిన ఘటననూ పోలీసులు ఛేదించారని సీపీ తెలిపారు. వేట కోసం ఏర్పాటు చేసిన ఉచ్చులో చిక్కుకున్న చిరుతపులిని కొందరు వ్యక్తులు కొట్టిచంపారని పేర్కొన్నారు. నిందితులు చిరుత మృతదేహాన్ని ధర్పల్లి గ్రామ శివారులోని ఓ మామిడితోటకు తరలించి నాలుగు పంజాలను వేరుచేసి మిగిలిన శరీర భాగాలను సమీపంలోని బావిలో పడేశారని తెలిపారు. ఈ కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్‌ అయ్యారని, మరొకరు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)