Breaking News

నేడు 5 జిల్లాల్లో శీతల గాలులు

Published on Sat, 11/15/2025 - 06:16

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రానున్న 2–3 రోజులు రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3–4 డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో అక్కడక్కడా శీతల గాలులు వీచే అవకాశం ఉందని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్‌యూ)లోని వ్యవసాయ వాతావరణ పరిశోధనా కేంద్రం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ పి.లీలారాణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండొచ్చు. రాబోయే 2–3 రోజుల్లో అక్కడక్కడా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3–4 డిగ్రీలు తక్కువగా ఉంటాయి.  

వ్యవసాయ వాతావరణ సూచనలు 
⇒ వేరుశనగ, బొబ్బర్లను ఈ నెల 30 వరకు విత్తుకోవచ్చు.  
⇒ మినుములు, పెసర విత్తనాలను వచ్చే నెల 10 వరకు విత్తుకోవచ్చు.  

⇒ జొన్న, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు విత్తనాలను వచ్చే నెల 31 వరకు విత్తుకోవచ్చు.  
⇒ యాసంగి వరి నారుమళ్లను నవంబర్‌ 20 నుంచి డిసెంబర్‌ 20 మధ్యలో పోసుకోవచ్చు.  
⇒ ఆలస్యంగా నాటుకున్న వానాకాలం వరిలో గింజమచ్చ తెగులు ఆశించే అవకాశముంది. నివారణకు 1 మి.లీ. ప్రోపికొనజోల్‌ + 1 మి.లీ. స్పైరోమెసిఫిన్‌ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)