Breaking News

ప్రేమించి పెళ్లి చేసుకున్న 45 రోజులకే..

Published on Mon, 03/17/2025 - 08:32

మహబూబ్ నగర్ జిల్లా: మండలంలోని రాళ్లగడ్డ తండాలో ఓ నవవధువు ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న నెలన్నర రోజులకే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. స్థానికుల వివరాల మేరకు..  గొల్లపల్లి శివారులోని రాళ్లగడ్డ తండాకు చెందిన పవన్‌కుమార్, ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన చర్చిత (23) ఖమ్మంలో బీఫార్మసీ చదువుతున్న సమయంలో ప్రేమలో పడ్డారు.

 45 రోజుల క్రితం ఆమె తన తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుంది. భార్యాభర్తలు ప్రస్తుతం రాళ్లగడ్డ తండాలో ఉంటున్నారు. ఆదివారం భర్త పవన్‌కుమార్‌ డ్యూటీకి వెళ్లి వచ్చి తండాలోని స్నేహితులతో మాట్లాడుతున్న సమయంలో చర్చిత ఇంట్లో ఒంటరిగా ఉంది. కొద్ది సేపటికే ఇంట్లోకి వెళ్లి చున్నీతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. 

వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో మృతిచెందింది. మృతురాలు ఎంఫార్మసీ పరీక్షలకు హాజరవుతుందని.. భర్త, ఇతర కుటుంబ సభ్యులతో అన్యూన్యంగా ఉంటున్న సమయంలో ఆత్మహత్యకు పాల్పడటానికి కారణాలు ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)