Breaking News

వధువు చీరే ఉరితాడు..!

Published on Tue, 02/24/2026 - 07:14

నారాయణ పేట: పెళ్లికి పెట్టు కున్న పారాణి ఆరక ముందే.. వధువు చీరనే ఉరితాడుగా మార్చుకొని ఓ నవ వరుడు బలవన్మర ణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. నారాయణ పేట జిల్లా నర్వ గ్రామానికి చెందిన గోవిందమ్మ, కృష్ణయ్య దంపతుల మొదటి కుమారుడు రవి(25)కి ఈ నెల 20న కర్నూలుకు చెందిన ఓ యువతితో నర్వలోనే వివాహం జరిగింది. 

రెండు రోజులు బాగానే ఉన్నప్పటికీ సోమవారం తెల్లవారుజామున నూతన వధూవరుల మధ్య చోటుచేసుకున్న కొద్దిపాటి తగాదాలో వధువు మూర్చపోయింది. ఈ ఘటనపై అమ్మాయి కుటుంబసభ్యులు వరుడు ఇంటికి వచ్చి కుటుంబసభ్యులపై దాడి చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వరుడు రవి తన భార్య పెళ్లి చీర తీసుకొని లంకాల్‌ గ్రామ శివారులోని ఓ పొలంలో చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడు. పెళ్లి జరిగి మూడు రోజులు గడవకముందే చావుబాజాలు మోగడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకు న్నాయి. ఈ ఘటనపై వరుడు తల్లి గోవిందమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రమేష్‌ తెలిపారు. 

#

Tags : 1

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)