Breaking News

లోక్‌సభ ఎన్నికలకు కొత్త ఓటర్ల జాబితా

Published on Fri, 12/08/2023 - 04:36

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం కొత్త ఓటర్ల జాబితా రూపకల్పన ప్రక్రియ ప్రారంభమైంది. వచ్చే జనవరి 1 అర్హత తేదీగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం–2024 షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. ఈ కార్య క్రమంలో భాగంగా 2024 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండనున్న యువతతో పాటు ప్రస్తుత ఓటరుజాబితాలో పేరు లేని వారి నుంచి సైతం దరఖాస్తులను స్వీకరించ నున్నారు.

జనవరి 6 నుంచి సవరణ ప్రారంభం కానుండ గా, అంతకు ముందు పోలింగ్‌ కేంద్రాల పునర్వ్య వస్థీక రణ, సెక్షన్ల ఏర్పాటు, ఓటర్ల జాబితా/ఫొటో ఓటరు గు ర్తింపు కార్డుల్లో లోపాల దిద్దుబాటు, ఓటర్ల జాబితాలో స రైన ఫొటోలు ముద్రించడం, పోలింగ్‌ కేంద్రాల సరిహ ద్దుల వారీగా సెక్షన్లు/పార్టుల పునర్విభజన తదితర చర్య లను జనవరి 5 వరకు పూర్తి చేయనున్నారు. జనవరి 6న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. నాటి నుంచి జనవరి 22 వరకు కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తు లు, ముసాయిదా జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తా రు.

ముసాయిదా జాబితాలో తప్పులు/లోపాల దిద్దుబా టు, ఓటరు చిరునామా మార్పు కోసం సైతందరఖాస్తు చే సుకోవడానికి వీలు కల్పించనున్నారు. ఫిబ్రవరి 2లోగా ద రఖాస్తులు, అభ్యంతరాలను పరిష్కరిస్తారు. ఫిబ్రవరి 6న తుది ఓటర్ల జాబితా నాణ్యతను పరిశీలించడంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆమోదముద్ర తీసుకుంటారు. ఫిబ్రవరి 8న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. 

డోర్‌ టూ డోర్‌ సర్వే
బూత్‌ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) తమ వద్ద ఉన్న ప్రస్తుత ఓటర్ల జాబితాను తీసుకుని ఇంటింటికీ తిరిగి కుటుంబ పెద్దను కలవడం ద్వారా సంబంధిత ఓటర్లు ఉన్నారా? లేదా? అన్న విషయంపై పరిశీలన జరపను న్నారు. 2024 జనవరి 1తో పాటు ఏప్రిల్‌ 1, జూలై 1, అక్టోబర్‌ 1 నాటికి 18 ఏళ్లు నిండనున్న యువత సైతం కొత్త ఓటర్లుగా నమోదు కావడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే 18 ఏళ్లు నిండిన తర్వాతే వారికి ఓటు హక్కు కల్పిస్తారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)