Breaking News

ఆ నాటుకోళ్లను అస్సలు తినొద్దు!

Published on Sat, 11/08/2025 - 19:38

ఒక షాపింగ్ మాల్‌లో “ఉచితంగా టేస్ట్ చేయండి” అని బిస్కెట్ స్టాల్ ఉంటే.. వచ్చిపోయేవాళ్లు ఆపుకోగలరా?. ఆన్‌లైన్‌లో “ఉచిత ట్రయల్” అని కనిపిస్తే, వెంటనే క్లిక్ చేయకుండా ఉండగలరా?. అలాగే.. సోషల్ మీడియాలో “ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోండి” అని కనిపిస్తే, షేర్ చేయడం మొదలవుతుంది కదా. ఫ్రీకి ఉన్న పవర్‌ అలాంటిది. అది మన ఆలోచనలపై ప్రభావం చూపుతుంది.. ఆకర్షణను పెంచుతుంది.. ఆచరణకు దారి తీస్తుంది. అలా..  

ఫ్రీగా నాటుకోళ్లు దొరుకుతుంటే జనం ఊరుకుంటారా?.. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో గుర్తుతెలియని వ్యక్తులు వందల సంఖ్యలో కోళ్లను పొలాల వెంట వదిలివెళ్లారు. దీంతో సిద్దిపేట-ఎల్కతుర్తి రహదారి వెంట జనాలు ఎగబడిపోయారు. కొందరు ఒకటి, రెండు పట్టుకుని పోతే.. మరికొందరు అందినకాడికి సంచుల్లో వేసుకుని ఇళ్లకు తీసుకెళ్లారు. ఈ సమాచారం అందుకున్న అధికారులు రంగంలోకి దిగారు.

కొన్ని కోళ్లను పట్టుకుని పశువైద్యాధికారుల వద్దకు తీసుకెళ్లారు. అయితే ప్రాథమికంగా ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించలేదట. దీంతో వాటిని మరిన్ని పరీక్షల కోసం ల్యాబ్‌లకు తరలించారు. ఈ క్రమంలో రేపు ఆదివారం కావడంతో జనాలు ఆ కోళ్లను తినే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఆరోగ్య రిత్యా ప్రజలు వాటిని తినకుండా ఉండాలని పశువైద్యాధికారులు సూచిస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. ఇంత పెద్దఎత్తున నాటు కోళ్లను ఎవరు, ఎందుకు వదిలిపెట్టారో ఇప్పటికీ తెలియ రాలేదు. మీడియా, సోషల్‌మీడియా ప్రచారంతో ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఈ మిస్టరీని చేధించే పనిలో ఉన్నట్లు సమాచారం. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)