Breaking News

ఏఐ క్లిక్‌.. ప్రాజెక్టుకు కిక్‌

Published on Thu, 06/04/2026 - 03:53

ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రాజెక్టు వర్క్‌ స్వరూపం పూర్తిగా మారబోతోంది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)పై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తోంది. దీనికోసం కొన్ని ప్రత్యేక టూల్స్‌ కూడా సిద్ధమయ్యాయి. దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలు ఇప్పటికే ఏఐ ఆధారిత ప్రాజెక్టు వర్క్‌లు చేస్తున్నాయి. విద్యార్థి సృజనాత్మకతకు కొత్త సాంకేతికత ఉపయోగపడుతోందని నిపుణులు అంటున్నారు. ఇటీవల దీనిపై అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అధ్యయనం చేసింది. 

ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంలో లభించే సరికొత్త టూల్స్‌ను అన్ని కాలేజీలు అనుసరించాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. ఈ మేరకు ఇటీవల దేశంలోని అన్ని యూనివర్సిటీలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇంజనీరింగ్‌ విద్యలో నైపుణ్యం పెంచేందుకు ప్రాజెక్టు వర్క్‌ కీలకం. టెక్నాలజీ మార్పులకు అనుగుణంగా ఏఐ ద్వారా దీనిని చేయడం వల్ల నాణ్యత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.  – సాక్షి, హైదరాబాద్‌

విభిన్న టూల్స్‌
ఇంజనీరింగ్‌ విద్యార్థులకు తొలి ఏడాది నుంచి ప్రాజెక్టు వర్క్‌ చేయడానికి, అవసరమైన సలహాలు ఇవ్వడానికి అనేక టూల్స్‌ సిద్ధంగా ఉన్నాయి. ఇందుకు సంబంధించిన ప్రతి డేటాను క్లౌడ్‌ ద్వారా ఏఐ తీసుకుంటుంది. కేవలం విద్యార్థి చదివే రాష్ట్రానికే పరిమితం కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సమాచార సేకరణకు ఏఐ టూల్స్‌ ఉపయోగపడతాయి. ప్రపంచ స్థాయిలో ఇంజనీరింగ్‌ విద్య, పారిశ్రామిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని వాటిని రూపొందించారు. 

» ఓపెన్‌ ఏఐ రూపొందించిన చాట్‌ జీపీటీ ద్వారా ప్రాజెక్ట్‌ ఐడియాలు, కోడింగ్, డీ బగ్గింగ్, డాక్యుమెంటేషన్‌ పనులు సులభమవుతాయి.  
»  గిట్‌హబ్‌ కాపిలాట్‌ కోడ్‌ ఆటోమేటిక్‌గా పనులను సూచిస్తూ సాఫ్ట్‌వేర్‌ ప్రాజెక్టుల అభివృద్ధిని వేగవంతం చేస్తోంది. 
»  గూగుల్‌ జెమినీ డేటా విశ్లేషణ, సాంకేతిక నివేదికలు, ప్రజెంటేషన్ల తయారీలో ఉపయోగపడుతోంది. 
»  ఆంత్రోపిక్‌ అభివృద్ధి చేసిన క్లాడ్‌ పెద్ద డాక్యుమెంట్లను విశ్లేషించడం, పరిశోధన నివేదికలను రూపొందించడంలో సహకరిస్తోంది. 
»  పర్‌ప్లెక్సిటీ ఏఐ పరిశోధనకు అవసరమైన మూలాలను వేగంగా గుర్తించి సమాచారాన్ని అందిస్తోంది. 
»  కాన్వా మేజిక్‌ డిజైన్‌ ప్రాజెక్టు ప్రజెంటేషన్లు, పోస్టర్లు, డిజైన్‌లను ఏఐ సహాయంతో రూపొందిస్తోంది.

కోడింగ్‌లోనూ ఏఐ కీలకం
కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థులు కోడ్‌ అభివృద్ధికి ఏఐను విస్తృతంగా ఉపయోగిస్తుండగా, ఎల్రక్టానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్‌ విద్యార్థులు కూడా వెనుకబడటం లేదు. సర్క్యూట్‌ డిజైన్ల కోసం ఏఐ ఆధారిత సిములేషన్‌ టూల్స్‌ వాడుతున్నారు. రొబోటిక్స్‌ ప్రాజెక్టులకు ఆటోమేటెడ్‌ కోడ్‌ జనరేషన్‌ వాడకం పెరిగింది. క్యాడ్‌ మోడలింగ్‌కు జనరేటివ్‌ డిజైన్‌ సాఫ్ట్‌వేర్, ఐవోటీ ప్రాజెక్టులకు సెన్సార్‌ ఇంటిగ్రేషన్‌ సూచనలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. 

డేటా సైన్స్‌ ప్రాజెక్టులకు ఆటోమేటెడ్‌ అనలిటిక్స్‌ ప్లాట్‌ఫాంలు అందుబాటులో ఉన్నాయి. వచ్చే ఐదేళ్లలో ఇంజనీరింగ్‌ ప్రాజెక్టు వర్క్‌లో ఏఐ కీలకంగా మారనుంది. సమస్య ఎంపిక నుంచి ప్రొటోటైప్‌ రూపకల్పన, పరీక్షలు, డాక్యుమెంటేషన్, ప్రజెంటేషన్‌ వరకు ప్రతి దశలో ఏఐ సహాయకారిగా వ్యవహరించే పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో ఇంజనీరింగ్‌ విద్యలో సృజనాత్మకత, ఆవిష్కరణ, పరిశ్రమ అనుసంధానం కొత్త స్థాయికి చేరుకునే అవకాశం ఉందని విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)