Breaking News

Telangana: చలాన్‌ రూల్స్‌ ఛేంజ్‌

Published on Sat, 10/11/2025 - 12:38

సూర్యాపేట జిల్లా: ట్రాఫిక్‌ రూల్స్‌ ఉల్లంఘించిన వాహనానికి పోలీసులు చలాన్‌(జరిమానా) విధిస్తున్నారు. అయితే వీటిని చెల్లించడంలో వాహన దారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఒకపై అలా చేసేందుకు వీలు ఉండదు. కేంద్ర రవాణాశాఖ రూపొందించిన కొత్త నిబంధనల ప్రకారం 45 రోజుల్లో చలాన్‌ చెల్లించకుంటే వాహనాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఇంకా పెండింగ్‌ పెడితే డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు చేసే అవకాశం కూడా ఉంటుంది.

రోజుకు 200 కేసులు
సూర్యాపేట జిల్లాలో ట్రాఫిక్‌ రూల్స్‌ ఉల్లంఘన కేసులు రోజుకు 200కు పైగానే నమోదవుతున్నాయి. హెల్మెట్‌ ధరించక పోవడం, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనం నడపడం, వ్యతిరేక దిశలో వెళ్లడం, నో పార్కింగ్‌ ఏరియాలో వాహనం నిలపడం, అతి వేగంగా వెళ్లడం వంటి వాటిలో ట్రాఫిక్‌ పోలీసులు వాహనం ఫొటో తీసి చలాన్‌ విధిస్తున్నారు. వాహనానికి చలాన్‌ విధించిన విషయం వాహనదారుడి ఫోన్‌కు మొసేజ్‌ రూపంలో కూడా పంపిస్తున్నారు. ఈ చలాన్‌ను 30 రోజుల్లో చెల్లించే వెసులుబాటు కల్పించారు. కొందరు వెంటనే అప్రమత్తమై ఆన్‌లైన్‌లో చెల్లిస్తున్నా, చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కేంద్ర రవాణాశాఖ తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో ఇకపై చలాన్ల చెల్లింపులో నిర్లక్ష్యం వహిస్తే అసలుకే ఎసరు వచ్చే అవకాశం ఉంది.

పెండింగ్‌ ఉంటే కష్టమే
చాలా మంది వాహనాలపై ఐదు నుంచి పది వరకు చలాన్లు పెండింగ్‌లో ఉంటున్నాయి. దొరికినప్పుడు చూద్దాంలే అని నిర్లక్ష్యం వహించడం వల్ల పెండింగ్‌ లిస్ట్‌ పెరుగుతూ పోతోంది. కానీ ఇక అది కుదరదు. కేంద్ర రవాణాశాఖ తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం ట్రాఫిక్‌ పోలీసులు విధించిన చలాన్‌ను 45 రోజుల్లోపు చెల్లించాలి. 5 కంటే ఎక్కువ చలాన్లు పెండింగ్‌లో ఉండి సదరు వాహనం పట్టుబడితే పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. దాంతో పాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ను రద్దు చేయవచ్చు. ఇంకా ఆలస్యం చేస్తే రవాణాశాఖ ఆ వాహనంపై లావాదేవీలకు అనుమతించక పోయే అవకాశం ఉంది.

10 నెలల్లో 1.89 లక్షల కేసులు
ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించే వారి విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. విధుల్లో ఉన్న పోలీసులు రూల్స్‌ బ్రేక్‌ చేసే వాహనాన్ని ఫొటో తీసి చలాన్‌ విధిస్తున్నారు. దాంతో పాటు ఎప్పటికప్పుడు వాహనాలు తనిఖీ చేస్తూ లైసెన్స్‌తో పాటు సరైన పత్రాలు లేని వాహనాలకు సైతం జరిమానా విధిస్తున్నారు. ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు సూర్యాపేట జిల్లాలో 1,89,889 కేసులు నమోదు చేశారు. కొందరు వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనల నుంచి తప్పించుకునేందుకు తప్పుడు నంబర్‌ ప్లేట్లు, ఇతర వాహనాల నంబర్లను బిగించుకుంటున్నారు. దాంతో చలాన్లు వేసే సమయంలో అవి అసలైన వాహనదారులకు వెళ్తుండడంతో వారు ఖంగు తింటున్నారు. డూప్‌ల ఆట కట్టించేందుకు పోలీసులు ముమ్మరంగా వాహనాల తనిఖీలు సైతం చేపడుతున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)