Breaking News

తెలంగాణలో ఇకపై స్వైపింగ్‌ కార్డులు.. తెల్ల రేషన్‌ కార్డు వీరికి మాత్రమే..

Published on Sat, 08/10/2024 - 16:36

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పాత రేషన్‌ కార్డుల స్థానంలో కొత్త కార్డులు ఇవ్వనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. త్వరలోనే దీనికి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయనున్నారు. 

వివరాల ప్రకారం.. తెలంగాణలో కొత్త రేషన్‌కార్డుల జారీపై నేడు కేబినెట్‌ సబ్‌ సమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పాత రేషన్‌ కార్డుల స్థానంలో కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక, తర్వాత జరగబోయే మీటింగ్‌లో దీనికి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయనున్నారు. కాగా, రాబోయే రేషన్‌ కార్డులు స్వైపింగ్‌ కార్డ్స్‌ మోడల్‌గా ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. 

కేబినెట్‌ సబ్‌ కమిటీలో నిర్ణయాలు ఇవే..

  • అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు
  • గ్రామీణ ప్రాంతాలలో వార్షిక ఆదాయం లక్షన్నర, మాగాణి 3.50 ఎకరాలు, చెలక 7.5 ఎకరాలు
  • పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రెండు లక్షలు
  • పట్టణ ప్రాంతాల్లో భూములను కాకుండా వార్షిక ఆదాయాన్ని ఆధారంగా మంజూరు
  • విధి, విధినాల రూపకల్పనలో రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం
  • లోకసభ, రాజ్యసభ, శాసనసభ, శాసనమండలి సభ్యుల  అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి
  • వారందరికీ సమాచారం చేరేలా లేఖలు రాయండి
  • సక్సేనా కమిటీ సిఫారసుల పరిశీలన
  • దేశంలోని మిగిలిన  రాష్ట్రాలలో తెల్లరేషన్ కార్డుల అర్హత ప్రమాణాలు  పరిశీలన
  • అంతర్ రాష్ట్రాలలో తెల్ల రేషన్ కార్డు ఉండి ఇక్కడా ఉంటే ఏరివేత 
     

ఇదిలా ఉండగా.. తెలంగాణలో చాలా కాలంగా రేషన్ కార్డులు జారీ చేయకపోవడంతో లక్షలాది మంది కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా విధి విధానాలు రూపొందించి అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
 

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)