కొత్త కార్డులకు రేషన్‌

Published on Sat, 08/23/2025 - 02:15

సాక్షి,  హైదరాబాద్‌: గ్రేటర్‌ పరిధిలో కొత్త ఆహార భద్రత (రేషన్‌)కార్డుదారులకు శుభవార్త. వీరికి వచ్చే నెల నుంచి రేషన్‌ సరుకులు అందనున్నాయి. పాత కార్డుదారులతో పాటు కొత్తగా రేషన్‌  కార్డులు మంజూరైన కుటుంబాలకు కూడా నెలవారీ రేషన్‌ కోటా విడుదలైంది. పౌరసరఫరాల గోదాంల నుంచి ప్రభుత్వ చౌకధరల దుకాణాలకు ఇండెంట్‌ ప్రకారం బియ్యం స్టాక్‌ సరఫరా ప్రారంభమైంది. సెపె్టంబర్‌ నుంచి సుమారు లక్షకు పైగా కొత్త  కార్డుదారులకు బియ్యం అందనున్నాయి. పౌరసరఫరాల శాఖ గత ఐదు నెలల నుంచి కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేస్తూ వస్తోంది.

 ఈ నెల 20 వరకు మంజూరైన కార్డుదారులకు సెపె్టంబర్‌ కోటా కేటాయించింది.  కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పాత కార్డుదారులకు జూన్‌ నెలలోనే ఒకేసారి మూడు నెలల కోటా కింద రేషన్‌ బియ్యం పంపిణీ జరిగింది. అయితే.. మే 20 వరకు మంజూరైన కొత్త కార్డుదారులకు కూడా మూడు నెలల కోటా ఒకేసారి అందజేశారు. అప్పటి నుంచి కొత్త రేషన్‌ కార్డు మంజూరు ప్రక్రియ కొనసాగుతున్నా... రేషన్‌ కోటా మాత్రం కేటాయించలేదు. మూడు నెలల కోటా గడువు ముగియడంతో తాజాగా పాత కార్డుదారులతో పాటు కొత్తవారికి కూడా సెపె్టంబర్‌ కోటా కేటాయించారు. 

గ్రేటర్‌లో 13.76 లక్షలకుపైగా కార్డులు 
గ్రేటర్‌ పరిధిలో సుమారు 13.76 లక్షల కార్డులు ఉండగా, అందులో దాదాపు 60.01 లక్షల యూనిట్లు (లబి్ధదారులు) ఉన్నారు. ప్రతి కార్డులోని యూనిట్‌కు ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం కోటా కేటాయించారు. ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా వచ్చే నెల 1 నుంచి 15 వరకు నెలవారీ కోటా పంపిణీ చేస్తారు. లబ్ధి కుటుంబాలు సెలవులు మినహా మిగతా రోజుల్లో  నెలవారీ కోటాను డ్రా చేసుకోవచ్చు. రేషన్‌ కార్డు కలిగిన కుటుంబాల్లోని సభ్యులు(కార్డులో పేరు ఉన్న సభ్యులు) ఒకరు ప్రభుత్వ చౌక ధరల దుకాణానికి వెళ్లి బయోమెట్రిక్‌ ఇచ్చి కుటుంబానికి కేటాయించిన సరుకుల కోటాను డ్రా చేయవచ్చు  సన్న బియ్యం మాత్రమే ఉచితంగా పంపిణీ చేస్తారు. మిగతా సరుకులు సబ్సిడీపై కొనుగోలు చేయాల్సి ఉంది.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)