Breaking News

New Ration Cards: తీసివేతలకు తిప్పలే!

Published on Mon, 03/10/2025 - 08:37

సాక్షి, హైదరాబాద్‌: కొత్త రేషన్‌ కార్డు మంజూరు మాటేమో గానీ.. పాత కార్డులోని పేర్ల తొలగింపు ప్రక్రియకు సైతం తిప్పలు తప్పడం లేదు. వివాహ బంధాలతో కొత్తగా ఏర్పాటైన కుటుంబాలు కొత్త రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు నానా తిప్పలు  పడుతున్నారు. తల్లిదండ్రుల కుటుంబ కార్డుల్లో పేర్లు రద్దయితే కానీ, కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో కుటుంబం రేషన్‌ కార్డుల నుంచి తమ పేర్లను తొలిగించుకునేందుకు ఉరుకులు పరుగులు చేస్తున్నారు. మీ సేవ, పౌర సరఫరాల సర్కిల్, తహసీల్‌ ఆఫీసుల్లో ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు సమరి్పంచి మెంబర్‌ డిలిషన్‌ కోసం రెండు మూడుసార్లు చక్కర్లు చేయక తప్పడం లేదు. సంబంధిత సిబ్బంది సైతం సిఫార్సు దరఖాస్తులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ.. మిగతా వాటిని పెండింగ్‌లో పడేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

లక్షన్నరకు పైగా దరఖాస్తులు 
గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా, మేడ్చల్‌–మల్కాజిగిరి పరిధిలో సుమారు రేషన్‌ కార్డుల్లోంచి పేర్ల తొలగింపునకు సుమారు లక్షన్నరకుపైగా ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. అందులో సగానికిపైగా దరఖాస్తులు పెండింగ్‌లో మగ్గుతున్నాయి.  గ్రేటర్‌ మొత్తమ్మీద సుమారు పన్నెండు అర్బన్‌ సర్కిల్‌ పరిధిలో 12,34,873 కార్డులు ఉండగా.. వీటిలో 42,72,820 మంది లబ్దిదారులు ఉన్నారు. గ్రామీణ ప్రాంతంలో మరో ఐదు లక్షల కార్డులు ఉండగా.. అందులో 17 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. 

అందులో మొత్తమ్మీద సుమారు 10 శాతం కుటుంబాల్లోని సభ్యులు  పెళ్లిళ్లతో  కొత్త కుటుంబాలుగా ఏర్పడ్డాయి. తాజాగా ప్రభుత్వం కొత్త రేషన్‌  కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తుండంతో కొత్త  కుటుంబాలకు ఆసక్తి పెరిగింది.  కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసేందుకు కుటుంబం కార్డులోని పేర్లు తొలగింపు పెద్ద సమస్యగా పరిణమించింది. కొత్త కుటుంబాల్లోని దంపతుల్దిరూ.. వారి తల్లిదండ్రుల కార్డుల్లో లబి్ధదారులుగా ఉండటంతో అందులోంచి వారి పేర్లను తొలగించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో రెండు కార్డుల్లోని ఇద్దరి పేర్లు డిలిషన్‌ కోసం తంటాలు పడుతున్నారు. రేషన్‌ కార్డుల్లో అర్బన్‌ పరిధికి సంబంధించి డిలిషన్‌ ప్రక్రియ సివిల్‌ సర్కిల్‌ కార్యాలయాల్లో జరుగుతుండగా, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ప్రక్రియ తహసీల్‌ ఆఫీస్‌లో జరుగుతోంది.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)