Breaking News

కాళేశ్వరం అధికారులపై NDSA కమిటీ సీరియస్‌

Published on Sat, 03/09/2024 - 19:52

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులో పని చేసిన అధికారులు, ఇంజనీర్లపై నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ కమిటీ చీఫ్‌, సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ సీరియస్‌ అయ్యారు. శనివారం ప్రాజెక్టు పరిశీలన అనంతరం జలసౌధలో జరిగిన కీలక సమావేశంలో ఇది చోటు చేసుకుంది.

కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలు తెలుసుకునే క్రమంలో అధికారుల తీరుపై అయ్యర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ భేటీలో కమిటీ అడిగిన ప్రశ్నలకు.. కొంతమంది అధికారులు క్లారిటీ లేని సమాధానాలిచ్చారు. అలాగే పలు ప్రశ్నలకు సమాధానాలు లేవంటూ నేరుగా చెప్పడంతో కమిటీ నిర్ఘాంతపోయింది. ఈ క్రమంలో.. ఇంజనీర్లు ఒకరిపై ఒకరు సాకులు చెప్పుకోవడంతో చంద్రశేఖర్‌ అయ్యర్‌ వాళ్లపై గరం అయ్యారు. ఇలా సమావేశంలో మూడుసార్లు ఆయన అధికారులపై సీరియస్‌ అయినట్లు సమాచారం.

ఈ మీటింగ్‌లో నీటిపారుదల శాఖ అధికారులు, ప్రభుత్వ అధికారులతో పాటు ఈ మూడు బ్యారేజీలకు పని చేసిన వర్క్ ఏజెన్సీలు పాల్గొన్నాయి. అలాగే..  2016 నుంచి ప్రస్తుతం (ఈనెల 8వ తేదీ దాకా) బ్యారేజీల ఇన్వెస్టిగేషన్‌, హైడ్రాలజీ, మోడల్‌ స్టడీస్‌, డిజైన్లు, నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్‌, ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌లో పాల్గొన్నవారు.. ఆయా విభాగాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న వారితోపాటు బదిలీ అయినవారు, పదవీ విరమణ చేసినవారు కూడా విధిగా ఈ మీటింగ్‌కు హాజరు కావడంతో ఎన్‌డీఎస్‌ఏ కమిటీ కీలక సమాచారాన్నే రాబట్టే ప్రయత్ని చేసినట్లు స్పష్టమవుతోంది.

ఇక తమ పర్యటన నేటితో ముగియడంతో ఆరుగురు సభ్యులతో కూడిన నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (NDSA) కమిటీ బృందం ఢిల్లీకి పయనం అయ్యింది. అంతకు ముందు.. గురు, శుక్ర వారాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను కమిటీ సందర్శించింది. భద్రత నడుమ.. కుంగిన ప్రాంతాలను పరిశీలించడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివరాలను సేకరించింది. నాలుగు నెలల్లో ఈ కమిటీ తమ నివేదికను సమర్పించాల్సి ఉంటుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)