నాటు కోడి మృతి.. 11 మందిపై కేసు

Published on Wed, 01/28/2026 - 07:43

సాక్షి, మహబూబాబాద్: నాటు కోడి చనిపోతే 11 మందిపై కేసు నమోదు అయ్యింది. ఈ ఘటన మరిపెడ మండలం మూలమర్రితండా గ్రామ పంచాయతీ పరిధిలో చోటు చేసుకుంది. కోడి చనిపోతే కేసు ఏంటి అనుకుంటున్నారా?.. అయితే ఇది చదివేయండి. 

భూక్యా మంచా అనే వ్యక్తి ఓ నాటు కోడిని అపురూపంగా పెంచుకుంటున్నాడు. ఈ క్రమంలో.. ట్రాక్టర్‌ కింద పడి అది మరణించింది. దీంతో మంచా గుండె బద్ధలైంది. తన కోడిని చంపింది ఇసుక మైనింగ్‌ మాఫియాదేనంటూ పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. అతని ఫిర్యాదుతో 11 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. 

ఈ సందర్భంగా బాధితుడు మంచా మాట్లాడుతూ.. మూలమర్రితండా శివారు పాలేరు వాగు నుంచి 11 మంది రెండు నెలలుగా నిత్యం అక్రమంగా ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారని ఆరోపించాడు. మైనర్లతో ఇసుక ట్రాక్టర్లను మూగ జీవాలపై నుంచే నడుపుతున్నారని పేర్కొన్నాడు. ఈ క్రమంలో తన కోడిపై నుంచి ఓ ట్రాక్టర్‌ ఎక్కించి చంపారని తెలిపాడు. 

మంచా ఫిర్యాదుతో పోలీసులకు కేసు నమోదు చేయని పరిస్థితి ఎదురైంది. ఇసుక ట్రాక్టర్ల యజమానులు వాంకుడోతు రవి, భూక్యా రఘు, వాంకుడోతు చింటు, తేజావత్‌ నెహ్రూ, తేజావత్‌ సక్రాం, తేజావత్‌ సీత్య, రమేశ్, భూక్యా వీరన్న, పి.హరీశ్, భూక్యా దేవా, గణేశ్‌పై మంగళవారం మరిపెడ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోద చేశారు. విచారణ జరిపి నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని మంచాను పోలీసులు పంపించేశారు. అయితే వ్యవహారంలో కాంప్రమైజ్‌ అయ్యే ప్రసక్తే లేదని ఫిర్యాదుదారుడు చెబుతుండడం గమనార్హం.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)