Breaking News

హిడ్మాను పట్టుకొని చంపారు

Published on Sat, 11/22/2025 - 04:18

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మడ్వి హిడ్మా, ఆయన జీవిత సహచరి రాజేను ప్రాణాలతో పట్టుకొని.. చిత్రహింసలు పెట్టి చంపేశాక ఎన్‌కౌంటర్‌ పేరిట కట్టుకథలు చెబుతున్నారని మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్‌ పేర్కొన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ ఈ నెల 23న దేశవ్యాప్తంగా బంద్‌ పాటించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు 20వ తేదీన రాసిన లేఖ శుక్రవారం వెలుగులోకి వచ్చింది. అందులో పేర్కొన్న వివరాలిలా ఉన్నాయి. 

విజయవాడలో అదుపులోకి..: ‘హిడ్మా, ఆయన జీవిత సహచరి రాజే.. కొందరితో చికిత్స నిమిత్తం విజయవాడకు వచ్చారు. చికిత్స పొందుతున్న క్రమంలో కొందరు ద్రోహులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో కేంద్ర హోం శాఖ సూచనలతో ఆంధ్ర ఎస్‌ఐబీ (స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో) బలగాలు వీరిని ఈ నెల 15వ తేదీన అదుపులోకి తీసుకున్నాయి. ఆపై లొంగదీసుకోవడానికి చేసిన ప్రయత్నం విఫలం కావడంతో క్రూరంగా హత్య చేశారు. ఆ తర్వాత మారేడుమిల్లి అడవుల్లో ఎన్‌కౌంటర్‌ జరిగిందని ప్రకటించడమంతా అబద్ధమే. 

ఆంధ్ర–ఒడిశా బోర్డర్‌ రాష్ట్ర కమిటీ సభ్యుడు శంకర్, మరికొందరిని పట్టుకొని కాల్చి చంపేసి రంపచోడవరం ఎన్‌కౌంటర్‌ పేరిట కట్టుకథ అల్లారు. ఉద్యమ స్ఫూర్తి చూపిస్తూ తమ అమూల్యమైన ప్రాణాలు అర్పించిన హిడ్మాకు మావోయిస్టు పార్టీ శిరస్సు వంచి శ్రద్ధాంజలి అరి్పస్తోంది. చివరి వరకు ఉద్యమంలో కొనసాగి, శత్రువుకు లొంగకుండా ప్రాణాలర్పించిన శంకర్, రాజే, చైతు, కమ్లూ, ముల్లాల్, దేవేలకు జోహార్లు అరి్పస్తున్నాం’అని అభయ్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. 

హిడ్మా వల్లే జనతన సర్కార్‌: ఉద్యమ అవసరాల కోసం మార్క్సిజాన్ని హిడ్మా విశేషంగా అధ్యయనం చేశాడని, వివిధ సందర్భాల్లో ఎన్నో సర్క్యులర్లు, బుక్‌ లెట్లను రాసి కేడర్ల అభివృద్ధికి కృషి చేశాడని అభయ్‌ తెలిపారు. మిలిటరీ రంగంలో విశేష అధ్యయనం చేసి మెరుగైన ఫలితాలను హిడ్మా సాధించాడన్నారు. ఆయన వల్లే వందలాది ఆయుధాలు పీఎల్‌జీఏ పరం అయ్యాయని తెలిపారు. శత్రు అధికారాన్ని ధ్వంసం చేయడంలో హిడ్మా పైచేయి సాధించాడని, దీని ఫలితంగానే దక్షిణ సబ్‌జోన్‌లో జనతన సర్కార్‌ నిర్మాణం జరిగిందని వెల్లడించారు. 

పాలకవర్గాల విషప్రచారం: హిడ్మాను ఒక దుర్మార్గుడిగా పాలకవర్గ మీడి యా ఎంతో కాలంగా చిత్రీకరిస్తున్నారని అభయ్‌ విమర్శించారు. హిడ్మాను హత్య చేశాక ఈ ప్రచారాన్ని మరింత ఉధృతం చేశారన్నారు. ఎంతగా విష ప్రచారాలు చేసినా ప్రజల హృదయాలలో హిడ్మా స్థానం చెరిగిపోదన్నారు. భగత్‌సింగ్, కొమురంభీం, గుండాదూర్, గేంద్‌సింగ్, అల్లూరి సీతారామరాజులాగే హిడ్మా చరిత్రలో నిలిచిపోతాడన్నారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)