Breaking News

‘సాక్షి’ చేతిలో సాత్విక్‌ సూసైడ్‌ నోట్‌.. నివ్వెరపోయే విషయాలు

Published on Wed, 03/01/2023 - 17:30

సాక్షి, హైదరాబాద్‌: నార్సింగిలో శ్రీ చైతన్య కళాశాల విద్యార్థి సాత్విక్‌ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. తాజాగా ఈ కేసులో సాత్విక్‌ సూసైడ్‌ లేఖ వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్యకు ముందు తను అనుభవించిన బాధను సాత్విక్‌ లేఖలో రాసుకొచ్చాడు. ప్రిన్సిపల్‌, కాలేజీ ఇంచార్జ్‌, లెక్చరర్‌ పెట్టే టార్చర్‌ వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నాడు.

‘అమ్మానాన్న.. నేను ఈ పని చేస్తున్నందుకు క్షమించండి. మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్ధేశం నాకు లేదు. కృష్ణారెడ్డి, ఆచార్య, శోభన్‌, నరేష్‌ వేధింపులను తట్టుకోలేకపోయాను. వీరు నలుగురు నాతోపాటు హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు నరకం చూపిస్తున్నారు.

వీరి వేధింపులు తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. సారీ అమ్మా.. నేను పడిన టార్చర్‌ వేరెవరికీ రాకూడదని కోరుకుంటున్నా. నన్ను వేధించిన ముగ్గురిపై చర్యలు తీసుకోవాలి. అమ్మా నాన్న లవ్‌ యూ, మిస్‌ యూ ఫ్రెండ్స్‌’ అంటూ సాత్విక్‌ తన సూసైడ్‌ నోట్‌లో  రాశాడు.

కాగా, నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్థి సాత్విక్‌ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.. మంగళవారం రాత్రి క్లాస్‌రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా గమనించిన తోటి విద్యార్థులు వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆసుపత్రికి తరలించేలోపే సాత్విక్‌ మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మరోవైపు తోటి విద్యార్థులు సైతం కాలేజీ ఒత్తిడి వల్లే సాత్విక్‌ ఆత్మహత్యకు పాల్పడినట్టుగా ఆరోపిస్తున్నారు.

Videos

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)