Breaking News

వెండితెరపై ‘పేట’ యువకులు

Published on Thu, 12/12/2024 - 11:34

నర్సంపేట : ఆ ముగ్గురికి చిన్నప్పటి నుంచి సినిమా అంటే ప్రాణం. ఎలాగైనా సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్నారు. అందుకు ఎక్కడ ఆడిషన్స్‌ జరిగినా వెళ్లే వారు. అలాగే, వివిధ సినిమా ఆఫీస్‌ల చుట్టూ తిరిగే వారు. చిన్న పాత్ర అయినా ఇవ్వమని కోరారు. తెలిసి వారి వద్దకు వెళ్లి తమలోని నటనా ప్రావీణ్యాన్ని ప్రదర్శించే వారు. అవకాశం వచ్చినట్లు వచ్చే చేజారేది. అయినా ఏమాత్రం నిరాశపడేవారు కాదు. మళ్లీ ప్రయత్నం చేసేవారు. చివరకు అనుకున్నది సాధించారు. తమ ఆకాంక్షకు అనుగుణంగా అవకాశం రావడంతో ఆ ముగ్గురు యువకులు హీరోలుగా రాణిస్తున్నారు. సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వారు తమప్రతిభతో ముందుకెళుతున్నారు. వారే నర్సంపేట నియోజకవర్గానికి చెందిన బూరగాని అనిల్, భూక్య సిద్ధు శ్రీఇంద్ర, బూస కుమార్‌. ఈ ముగ్గురు హీరోలుగా నటించిన తమ సినిమాలు ఇప్పటికే విడుదలయ్యాయి.

అనిల్‌ నటన అద్భుతం..
బూరగాని అనిల్‌ది నర్సంపేట నియోజకవర్గంలోని నెక్కొండ మండల కేంద్రం. తల్లిదండ్రులు బూరగాని కొమురయ్య–రమాదేవి. అనిల్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు. సినిమాపై ఆసక్తి ఉండడంతో ఆ రంగం వైపు వెళ్లాడు. పలువురి వద్దకు వెళ్లి తన ప్రతిభను తెలియజేశాడు. వారికి అనిల్‌ నటన నచ్చడంతో అవకాశం ఇచ్చారు. దీంతో అనిల్‌ ‘వజ్రాలు కావాలా నాయనా’ అనే సినిమాలో మొదటిసారిగా నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 2017న విడుదలైంది. ఇందులో అనిల్‌ అద్భుత నటనకు పలువురు ముగ్థులయ్యారు. రెండో సినిమా ‘ఇరావణ’ విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో పాటు ప్రేమతో మీ అభిరామ్, దునియా, ప్రేమకుజై, తదితర చిత్రాల్లో నటిస్తున్నట్లు అనిల్‌ చెప్పాడు.  కాగా, టీవీషోలు అత్తారింటికి దారేది, శ్రీమంతుడు, రాజేశ్వరివిల్లాస్‌ కాఫీ క్లబ్, అనుపల్లవి, కలవారి కోడలు కనకమహాలక్ష్మి వంటి సీరియల్‌లో నటిస్తున్నట్లు అనిల్‌ తెలిపారు.

సిద్ధు..‘అనాథ’
భూక్య సిద్ధు గిరిజన ప్రాంతంలో పుట్టి పెరిగాడు. తనలో ఉన్న నటనా ప్రావీణ్యంతో సినిమా రంగంలో రాణించాలని 13 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. చివరకు అదృష్టం వరించింది. వారం రోజుల క్రితం ‘అనా«థ’ అనే సినిమాను నిర్మించి హీరోగా వెండి తెరకు పరిచమయ్యాడు. మొదటి సినిమాలోనే మంచి నటన ప్రావీణ్యం కనబర్చడంతో ఈ సినిమా పలువురిని ఆకట్టుకుంది. నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండలం బుచ్చిరెడ్డిపల్లెకు చెందిన సకృ, సరోజన దంపతుల కుమారుడు సిద్ధు. మ్యూజిక్‌ డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరోగా రాణిస్తూ గోనేంద్ర ఫిలింస్‌ సంస్థ ద్వారా అనాథ సినిమాను తెలుగు, కన్నడంలో తీసి ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతం రెండో సినిమా కూడా తీస్తున్నట్లు సిద్ధు తెలిపారు.

‘రియల్‌’ రంగం నుంచి హీరోగా..
రియల్‌ ఎస్టేట్‌ రంగంలో రాణిసూ్తనే సినిమా హీరోగా గుర్తింపు పొందాలనే తపనతో వెండి తెరకు పరిచయమయ్యాడు నర్సంపేట నియోజకవర్గంలోని గుర్రాలగండి రాజపలి్ల గ్రామానికి చెందిన బూస  కుమార్‌. సినిమా రంగంలోని పలువురు ప్రముఖులను కలిసినా ఎవరూ అవకాశాలు ఇవ్వలేదు. దీంతో తానే స్వయంగా ‘షాన్‌’ అనే సినిమాను రూపొందించాడు. ఇందులో తనే హీరోగా నటించాడు. అంతేకాకుండా నిర్మాత, దర్శకుడిగా వ్యవహరించి గత సంవత్సరం తన అదృష్టం పరీక్షించుకున్నాడు. వరంగల్‌ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు పూర్తిగా అవగాహన ఉండడంతో ఆయా ప్రాంతాల్లో చిత్రీకరణ చేసి తన ఆలోచనలకు అనుగుణంగా సినిమా పూర్తి చేశాడు. అనంతరం విడుదల చేసి సఫలీకృతుడయ్యాడు. ప్రస్తుతం మరో సినిమా కూడా చేస్తున్నట్లు ‘సాక్షి’కి వివరించాడు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)