Breaking News

28న పోలవరంపై ప్రధాని మోదీ సమీక్ష

Published on Sat, 05/17/2025 - 00:46

సాక్షి, హైదరాబాద్‌: పోలవరం జాతీయ ప్రాజెక్టు పనులపై ఈనెల 28న ప్రధాని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించనున్నారు. భూసేకరణ, నిర్వాసితులకు పునరావాస కల్పన, పనుల పురోగతిని సమీక్షించి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ ఒడిశాల్లో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పబ్లిక్‌ హియరింగ్‌(బహిరంగ విచారణ) నిర్వహించడంపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు దిశానిర్దేశం చేయనున్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతగా చేపట్టిన ప్రాజెక్టులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులను గైడ్‌ చేసేందుకు పీఎం ప్రగతి కార్యక్రమాన్ని ప్రధాని మోదీ చేపట్టారు. పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ప్రాజెక్టులో 41.15 మీటర్ల ఎత్తు వరకూ నీటిని నిల్వ చేయడానికి వీలుగా 15,227.84 ఎకరాల భూమిని ఇంకా సేకరించాలి. పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయాలంటే 53,393.89 ఎకరాల భూమిని ఇంకా సేకరించాల్సి ఉంది. ప్రాజెక్టు పనులు ఇప్పటి వరకూ 60.78 శాతం పూర్తయ్యాయి.

రిజర్వాయర్‌లో నీటిని నిల్వ చేయాలంటే.. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లలో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖతో కలిసి పబ్లిక్‌ హియరింగ్‌ నిర్వహించాలి. ప్రాజెక్టు భూసేకరణ, నిర్వాసితులకు పునరావాస కల్పన పనుల్లో పురోగతిని సమీక్షించి, గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌కు దిశానిర్దేశం చేయనున్నారు.

పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ ప్రభావం వల్ల తమ ప్రాంతాలు ముంపునకు గురవుతాయని ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో కేసులు వేశాయి. ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయాలంటే ఆ మూడు రాష్ట్రాల అనుమానాలను నివృత్తి చేయాల్సి ఉంది. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పబ్లిక్‌ హియరింగ్‌ నిర్వహించాలి. బ్యాక్‌ వాటర్‌ ప్రభావంపై నాలుగు రాష్ట్రాల సీఎస్‌లతో చర్చించి.. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పబ్లిక్‌ హియరింగ్‌ నిర్వహించడంపై ప్రధాని మోదీ మార్గనిర్దేశం చేయనున్నారు.  

Videos

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)