Breaking News

నీ తెగువ చూస్తే.. మానవత్వం ఇంకా చనిపోలేదనిపిస్తుంది: సజ్జనార్‌

Published on Mon, 01/26/2026 - 15:29

హైదరాబాద్‌:  నాంపల్లి ఫర్నిచర్‌ షాపులో రెండు రోజుల క్రితం జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఒక వ్యక్తి చూపించిన తెగువను సీపీ సజ్జనార్‌ ప్రత్యేకంగా ప్రశంసించారు. నేటి సమాజంలో ఈ తరహా మనుషులతో మానవత్వం ఇంకా చనిపోలేదనే విషయం అర్థమవుతుందని సజ్జనార్‌ కొనియాడారు.. ఈ మేరకు ‘ఎక్స్‌’ వేదికగా ట్వీట్‌ చేశారు సజ్జనార్‌

‘మనుషులున్నారు కానీ.. మానవత్వం ఏది?' అనే ప్రశ్నకు నిలువెత్తు నిదర్శనం దినేష్. అఫ్జల్‌గంజ్‌కు చెందిన దినేష్, ఇటీవల నాంపల్లి ఫర్నిచర్ షాపులో జరిగిన అగ్ని ప్రమాద సమయంలో చూపిన తెగువ చూస్తే.. మానవత్వం ఇంకా చనిపోలేదని అనిపిస్తుంది. ఓ పక్క ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలు.. మరోపక్క బాధితుల ఆర్తనాదాలు.. అయినా దినేష్ వెనకడుగు వేయలేదు.

తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రమాదం జరిగితే వీడియోలు తీస్తూ కాలక్షేపం చేసే ఈ రోజుల్లో.. ప్రాణాలకు తెగించి దినేష్ చేసిన సాయం నిజంగా సాహసోపేతం. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దినేష్‌ను సత్కరించుకోవడం ఎంతో గర్వంగా ఉంది. 

ఈ ప్రమాదంలో ప్రాణాలకు తెగించి సహాయక చర్యల్లో పాల్గొన్న మహమాద్ జకీర్, కలీం, రహీం, అమర్ తో పాటు చొరవ చూపిన కార్పొరేటర్లు సురేఖ ఓం ప్రకాశ్, జఫర్ ఖాన్ కు అభినందనలు తెలియజేస్తున్నారు. కేవలం దినేష్ మాత్రమే కాదు.. ఆపద సమయంలో మతసామరస్యం వెల్లువిరిసింది. అందరూ భుజం భుజం కలిపి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కష్టం వస్తే 'మేమంతా ఒక్కటే' అని నిరూపించి, హైదరాబాద్ గంగా-జమునా తహజీబ్ సంస్కృతిని మరోసారి చాటిచెప్పారు. వారందరికీ సెల్యూట్!!

 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?