Breaking News

బాలికపై అసభ్య ప్రవర్తన.. కానిస్టేబుల్‌పై పోక్సో కేసు!

Published on Mon, 07/20/2026 - 09:25

నల్లగొండ: విధుల్లో ఉండి చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసు కానిస్టేబుల్‌పైనే పోక్సో కేసు నమోదవడం జిల్లాలో సంచలనంగా మారింది. నల్లగొండ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలో గుర్రంపోడు పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సత్యనారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం, సైకిల్‌పై వెళ్తున్న బాలికను నిందితుడు అడ్డగించి అసభ్యంగా తాకి వేధించించాడు . ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు వెంటనే వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

దర్యాప్తులో భాగంగా ఘటనాస్థలంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. నిందితుడు మాస్క్ ధరించి పలుచోట్ల సంచరించాడు, పోలీస్‌లు సీసీటీవీ దృశ్యాల సహాయంతో అతడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు గుర్రంపోడు పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సత్యనారాయణగా పోలీసులు గుర్తించారు.

ఇదిలా ఉండగా, గతంలో నకిరేకల్‌లో విధులు నిర్వహించిన సమయంలో కూడా అతడిపై రెండు పోక్సో కేసులు నమోదైనట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. స్టేషన్ కు వచ్చే మహిళల పట్ల కూడా నీచంగా ప్రవర్తించే వాడని ఆరోపణలు ఆరోపణలు  ఆరోపణలు ఉన్నాయి.

ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై చర్యలు తీసుకోకుండా వివిధ ప్రాంతాల్లో పోస్టింగులు ఇవ్వడంపై స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)