Breaking News

కర్రీ పఫ్‌లో పాము

Published on Wed, 08/13/2025 - 07:07

 మహబూబ్ నగర్ జిల్లా: ఆకలిగా ఉందన్న పిల్లల కోసం ఒక మహిళ బేకరీలో కొని తీసుకొచ్చిన కర్రీ పఫ్‌ తింటుండగా.. అందులో పాము కనిపించడంతో హడలిపోయారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో జరిగిన ఈ సంఘటనపై సీఐ కమలాకర్‌ కథనం మేరకు.. పట్టణంలోని జౌఖీనగర్‌లో నివాసం ఉంటున్న శ్రీశైలమ్మ మంగళవారం సాయంత్రం కూతురు, కొడుకు కోసం శ్రీలక్ష్మి అయ్యంగార్‌ బేకరీలో పిల్లలకు ఒక ఎగ్‌ పఫ్, కర్రీ పఫ్‌ కొనుగోలు చేశారు. 

ఇంటికి తీసుకెళ్లిన తర్వాత కర్రీ పఫ్‌ను తింటుండగా.. పంటికి ఏదో గట్టిగా తగిలింది. దీంతో అనుమానం వచ్చి కర్రీ పఫ్‌ను తెరిచి చూసి బిత్తరపోయారు. నిశితంగా పరిశీలించగా అందులో చనిపోయిన చిన్న పాము కనిపించింది. దీంతో ఒక్కసారిగా భయాందోళన చెందిన తల్లి శ్రీశైలమ్మ.. కర్రీ పఫ్‌ను తీసుకుని సంబంధిత బేకరీ దగ్గరకు వెళ్లి విషయం చెప్పారు.

 అయితే ఇవన్నీ మామూలేనని.. తమకు వచ్చిన కూరగాయల్లో చనిపోయిన పాము ఉండి ఉంటుందని బేకరీ నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో బాధితురాలు తన భర్త శ్రీశైలంతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఫుడ్‌ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇచ్చామని సీఐ తెలిపారు. 

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)