Breaking News

‘నేతన్నకు భరోసా’కు మార్గదర్శకాలు

Published on Wed, 06/04/2025 - 06:17

సాక్షి, హైదరాబాద్‌: ‘నేతన్నకు భరోసా’ పథకానికి ఈ నెల 2న మార్గదర్శకాలను జారీ చేసినట్లు చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు తెలిపారు. ఇందుకోసం రూ.48 కోట్ల బడ్జెట్‌ కేటాయించినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకంలో భాగంగా.. జియో ట్యాగ్‌ చేసిన మగ్గాలపై పనిచేస్తున్న వారికి వేతన ప్రోత్సాహకం కింద.. గరిష్టంగా ఏటా నేత కార్మికులకు రూ.18,000, అనుబంధ కార్మికులకు రూ.6,000 అందించనున్నట్లు తెలిపారు. ఇందువల్ల దాదాపు 40,000 మంది చేనేత, అనుబంధ కార్మికులు లబ్ధి పొందుతారని వివరించారు.

చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలకు ప్రత్యేకంగా రూపొందించిన యూనిక్‌ లోగోను జత చేయనున్నట్లు తెలిపారు. 18 ఏళ్లు నిండి జియో ట్యాగ్‌ చేసిన మరమగ్గాలపై పనిచేసే కార్మికులు, ప్రీలూమ్, ప్రిపరేటరీ పనులైన.. డైయింగ్, టైయింగ్, డిజైనింగ్, వార్పింగ్, వైండింగ్, సైజింగ్‌ తదితర అనుబంధ పనులు చేసే కార్మికులు, వార్షికాదాయంలో చేనేత వృత్తి ద్వారా కనీసం 50 శాతం ఆర్జిస్తున్న వారు అర్హులని పేర్కొన్నారు.

ఈ పథకం కింద జియో ట్యాగ్‌ చేసిన మగ్గాల ద్వారా కనీసం 50 శాతం కంటే ఎక్కువ వార్పులు పూర్తి చేసిన వారికి నేరుగా వేతన ప్రోత్సాహకం కింద.. ఏటా రెండు విడతలుగా (ఏప్రిల్‌ నుండి సెప్టెంబర్, అక్టోబర్‌ నుండి మార్చి) బ్యాంకు ఖాతాలోకి నేత కార్మికునికి రూ.9,000, అనుబంధ కార్మికునికి రూ.3,000 జమ చేయనున్నట్లు వివరించారు. కాగా, మొదటి విడతలో 50 శాతం వార్పులు పూర్తి చేయని వారు, రెండో విడతలో పూర్తి చేసినట్లయితే మొత్తం ప్రోత్సాహకాన్ని.. సంవత్సరాంతంలో చేనేత, అనుబంధ కార్మికులకు అందించనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)