Breaking News

నాగ్‌ పిటిషన్‌.. కొండా సురేఖకు బిగ్‌ షాక్‌

Published on Thu, 11/28/2024 - 20:29

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణ మంతత్రి కొండా సురేఖకు బిగ్‌ షాక్‌ తగిలింది. సినీ నటుడు అక్కినేని నాగార్జున వేసిన పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కాగ్నిజెన్స్‌లోకి తీసుకుంది. దీని ఆధారంగా.. మంత్రి కొండా సురేఖకు సమన్లు జారీ చేస్తూ తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. తన కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నాగార్జున దావా వేసిన విషయం తెలిసిందే.

చేసిన ఆరోపణలకుగానూ కొండా సురేఖపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని నాగార్జున వేసిన పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో వాదనలు జరిగాయి. నాగార్జున తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. వాదనల సందర్భంగా నాగార్జున తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. నాగార్జునపై కొండా సురేఖ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్నారు. ఆ తర్వాత ‘ఎక్స్‌’లో క్షమాపణ కోరుతూ పోస్ట్ పెట్టారన్నారు.

ఎక్స్‌లో మంత్రి కొండా సురేఖ పెట్టిన పోస్టును ఆయన కోర్టు ముందు చదివి వినిపించారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని అశోక్‌రెడ్డి అన్నారు. కచ్చితంగా కొండా సురేఖ క్రిమినల్ చర్యలకు అర్హురాలు అని పేర్కొన్నారు. అంతకు ముందు.. కొండా సురేఖ తరఫు న్యాయవాది గురుప్రీత్ సింగ్.. ఆమె క్షమాపణలు చెప్పినట్లుగా  కౌంటర్‌ దాఖలు చేశారు.

అయితే ఈ వ్యాఖ్యల వల్ల నాగార్జున కుటుంబం మానసికంగా ఎంతో కుంగిపోయిందని న్యాయవాది అశోక్ రెడ్డి వాదించారు. అంతకు ముందు.. నాగార్జున, ఆయన కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది. ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుంటూ.. డిసెంబర్‌ 12న సురేఖను కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చదవండి: కొండా సురేఖకు ఇదొక గుణపాఠం కావాలి!

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)