Breaking News

నాబార్డ్‌ పంట రుణాలు తగ్గాయ్‌!

Published on Sun, 02/16/2025 - 04:26

సాక్షి, హైదరాబాద్‌: రైతుకు రుణాల జారీలో రాష్ట్రస్థాయి బ్యాంకులే కాక... జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్‌) కూడా చిన్నచూపే చూస్తోంది. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు కొన్నేళ్లుగా గణనీయంగా పెరుగుతుండగా, రైతుకు ఇచ్చే రుణాల విషయంలో మాత్రం బ్యాంకులు లక్ష్యాలకు దూరంగానే ఉంటున్నాయి. 2025–26 సంవత్సరానికి నాబార్డు విడుదల చేసిన ఫోకస్‌ పేపర్‌ ఈ విషయాన్ని వెల్లడిస్తోంది. 

2025–26 సంవత్సరానికి తెలంగాణలో రుణాల లక్ష్యం రూ.3.86 లక్షల కోట్లుగా పేర్కొన్నప్పటికీ... ఇందులో కేవలం పంటలకు సంబంధించి పంట ఉత్పత్తి, నిర్వహణ, మార్కెటింగ్‌ కోసం కేటాయించిన నిధులు రూ. 87,149 కోట్లు మాత్రమే. ఈ మొత్తం 2024–25లో పెట్టుకున్న రూ.90,794 కోట్ల లక్ష్యం కంటే రూ.3,645 కోట్లు తక్కువ కావడం గమనార్హం. 

ఐదేళ్లుగా లక్ష్యానికి దూరంగా రుణాలు 
వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2024–25 లక్ష్యానికన్నా రూ.3,645 కోట్లు తక్కువగా రుణ అంచనాను ప్రకటించిన నాబార్డ్‌ అంతకుముందు మూడేళ్లు కూడా పంటలకు ఇచ్చే రుణాల విషయంలో లక్ష్యాలను చేరుకోలేదు. 2021–22లో పంట రుణాల కింద రూ. 59,440 కోట్లు లక్ష్యంగా నిర్ణయించుకొని కేవలం రూ. 42,854 కోట్లు మాత్రమే ఇవ్వగలిగింది. 

2022–23లో రూ.67,764 కోట్ల లక్ష్యాలకు గాను రూ. 59,060 కోట్ల వరకే ఇచ్చిoది. 2023–24లో అత్యధికంగా రూ.10వేల కోట్ల లోటు కనిపించింది. ఆ ఏడాది రూ. 73,437 కోట్ల లక్ష్యానికి గాను రూ. 64,940 కోట్లు మాత్రమే పంట రుణాలుగా ఇవ్వగలిగారు. 

రుణాలు, పెట్టుబడి 1.39 లక్షల కోట్లు 
పంటకు సంబంధించి రుణాలు 87,149 కోట్లు కా గా నీటి వనరులు, యాంత్రీకరణ, ప్లాంటేషన్, హార్టికల్చర్, అటవీ, బీడు భూముల వినియోగంతో పాటు పశుసంవర్థక శాఖ, మత్స్య శాఖలకు సంబంధించి టర్మ్‌లోన్లు, పెట్టుబడి కలిపి 2025–26 సంవత్సరానికి నాబార్డ్‌ రూ.1.39 లక్షల కోట్ల రుణ అంచనా వేసింది. 

ఇందులో యాంత్రీకరణకు రూ. 5,608 కోట్లు, నీటి వనరులకు రూ.2,613 కోట్లు, అటవీ, బీడు భూముల సాగుకు రూ. 793 కోట్లు కేటాయించింది. పశుసంవర్థక శాఖలో డెయిరీ, పౌల్ట్రీ, గొర్రెలు, మేకలు, పందులు, చేపల పెంపకానికి రూ.16వేల కోట్ల వరకు కేటాయించారు.  

53 శాతం నిధులు ఎంఎస్‌ఎంఈలకే.. 
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) ఏర్పాటుకు నాబార్డు అత్యధికంగా రూ. 2.03 లక్షల కోట్లు కేటాయించింది. ఇది రాష్ట్రానికి కేటాయించిన మొత్తం బడ్జెట్‌లో 53 శాతం. వ్యవసాయ టర్మ్‌ లోన్లు 12 శాతం కాగా, వ్యవసాయ మౌలిక వసతులకు కేవలం 2 శాతం కేటాయించారు.    

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)