Breaking News

ఆ కానిస్టేబుల్‌ ప్రైవేట్‌ వెహికిల్‌ ఎందుకు నడిపారు?

Published on Sun, 12/08/2024 - 12:42

ములుగు : వాజేడు ఎస్సై హరీశ్‌ ఆత్మహత్యకు గల ప్రధాన కారణాలను పోలీసులు ఇప్పటి వరకూ వెల్లడించలేకపోతున్నారు. ఎస్సై ఆత్మహత్య రోజు ఏమి జరిగిందనే అంశం మిస్టరీగా మారుతోంది. నల్లగొండ జిల్లా చిలుకూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ తండాకు చెందిన యువతి బ్లాక్‌ మెయిలింగ్‌ కారణంగానే ఎస్సై ఆత్మహత్యకు పాల్పడ్డాడనే వార్తలు వెలువడుతున్నాయి. దీంతోపాటు మరేమైన బలమైన కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసు యంత్రాంగం రహస్యంగా వివరాలు సేకరిస్తోంది. సదరు యువతి ఈ నెల 1వ తేదీన ఎస్సై హరీశ్‌ కోసం వచ్చినట్లు ఆధారాలతో పూర్తి సమాచారం ఉంది. 

ఈ క్రమంలో ఫెరిడోస్‌ రిసార్ట్‌లోని ఓ గదిలో ఎస్సై ఆత్మహత్య అనంతరం సదరు యువతిని పోలీస్‌ శాఖతో పాటు ఇతరులు గమనించారు. దీంతో ఎస్సై హరీశ్‌ ఆత్మహత్య ఘటనలో  ఆమె ప్రధాన కారణమా లేక ఇతర విషయాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. హరీశ్‌ చనిపోక ముందు రోజు యువతితో మాట్లాడే క్రమంలో ఒత్తిడికి లోనై స్నేహితులకు ఫోన్‌ చేశారు. దీంతో ఓ స్నేహితుడు రిసార్ట్‌కు చేరుకుని యువతితో మాట్లాడి ఆమెను ఒప్పించినట్లు సమాచారం. 

సమస్య సద్దుమనిగినట్లు భావించిన ఎస్సై హరీశ్‌ స్నేహితుడిని వెళ్లిపోవాలని సూచించినట్లు తెలిసింది.      దీంతో అతను అక్కడి నుంచి బయలుదేరి ములుగు చేరుకున్నాడు. తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో నిద్ర నుంచి లేచిన సదరు యువతి.. ఎస్సైతో గొడవకు దిగినట్లు సమాచారం. దీంతో మరోసారి ఒత్తిడికి లోనైన హరీశ్‌ ఫోన్‌ ద్వారా స్నేహితుడిని సంప్రదించాడు. అప్రమత్తమైన స్నేహితుడు ములుగు నుంచి బయలుదేరి వాజేడుకు చేరుకోకముందే ఎస్సై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. 

ఆ కానిస్టేబుల్‌ ప్రైవేట్‌ వెహికిల్‌ ఎందుకు నడిపారు?
వాజేడు ఎస్సై ఆత్మహత్యకు పాల్పడడానికి ప్రధాన కారణంగా తెలుస్తున్న సదరు యువతి ఈనెల 1వ తేదీ వాజేడు స్టేషన్‌ ముందు నుంచి ఎస్సై హరీశ్‌కు కాల్‌ చేసింది. ఈ క్రమంలో ఓ ప్రైవేట్‌ వెహికిల్‌ ద్వారా ఆమెను రిసార్ట్‌కు పంపించారు. అయితే ఈ వాహనాన్ని నడిపిన వాజేడు పోలీస్‌స్టేషన్‌ కానిస్టేబుల్‌ ఎవరు అనే అంశం ఇప్పటికీ తెలియడం లేదు. చివరికి ఆ యువతిని రిసార్ట్‌లో డ్రాప్‌ చేసిన అనంతరం రెండు, మూడు సార్లు సదరు వ్యక్తి ప్రైవేట్‌ వాహనంలో కనిపించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.

ఎస్సై హరీశ్‌ విషయంలో కీలక ఆధారాలు అతని వద్దే?


 

 

Videos

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)