Breaking News

రివైజ్డ్‌ డిజైన్లు ఇవ్వకనే బరాజ్‌కు నష్టం!

Published on Sat, 01/25/2025 - 03:58

సాక్షి, హైదరాబాద్‌:  మేడిగడ్డ బరాజ్‌ను తొలిసారి 2019లో నీళ్లతో నింపారని, అదే ఏడాది బరాజ్‌కు నష్టం జరిగిందని నిర్మాణ సంస్థ ‘ఎల్‌ అండ్‌ టీ’ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఎంవీ రామకృష్ణరాజు జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌కు వెల్లడించారు. బరాజ్‌ దిగువన సీసీ బ్లాకులు కొట్టుకుపోయి అప్రాన్‌ పూర్తిగా ధ్వంసమైనట్టు గుర్తించి, నీటిపారుదల శాఖకు నివేదించామని వివరించారు. బరాజ్‌లో లోపాలను సరిదిద్దేందుకు రివైజ్డ్‌ డిజైన్లు, డ్రాయింగ్స్‌ను నీటిపారుదల శాఖ అందించలేదని, దీంతో సమస్య పెరిగి 2023 అక్టోబర్‌ 21న 7వ బ్లాక్‌ కుంగిపోయిందని పేర్కొన్నారు. ముందే రివైజ్డ్‌ డిజైన్లు ఇచ్చి ఉంటే బరాజ్‌ను రక్షించుకోవడానికి అవకాశం ఉండేదని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్‌ల నిర్మాణంపై ఏర్పాటైన జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ శుక్రవారం మేడిగడ్డ బరాజ్‌ నిర్మాణ సంస్థ ‘ఎల్‌ అండ్‌ టీ’ప్రతినిధులకు క్రాస్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహించింది. 

డిజైన్లతో మాకు సంబంధం ఉండదు.. 
‘‘మేడిగడ్డ, ఇతర బరాజ్‌లలో 2019లో ఒకే తరహా సమస్యలు ఉత్పన్నమయ్యాయి. నీటి పారుదల శాఖ సెంట్రల్‌ డిజైన్స్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఓ) ఇంజనీర్ల ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్‌ ఇంజనీరింగ్‌ రీసెర్చ్‌ లేబోరేటరీస్‌ (టీఎస్‌ఈఆర్‌ఎల్‌)తో మళ్లీ మోడల్‌ స్టడీస్‌ నిర్వహించాలని క్షేత్రస్థాయిలోని ఈఈ పైఅధికారులకు లేఖ రాశారు. 2020 జూన్‌లో సెంట్రల్‌ వాటర్‌ పవర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌) నిపుణులు, సీడీఓ ఇంజనీర్లు బరాజ్‌లను పరిశీలించారు. బరాజ్‌ రక్షణ కోసం ఎనర్జీ డిస్సిపేషన్‌ పనుల డిజైన్లను రూపొందించాలని 2020 ఫిబ్రవరిలో నీటిపారుదల శాఖ ఈఎన్సీ.. సీడీఓ సీఈను ఆదేశించారు.

టీఎస్‌ఈఆర్‌ఎల్‌ నిర్వహించిన 2డీ మోడల్‌ స్టడీస్‌ ఆధారంగా.. బరాజ్‌ దిగువన తగిన రీతిలో ఎనర్జీ డిస్సిపేషన్‌ ఏర్పాట్లు చేసేందుకు డిజైన్లను అందించాలని 2021 మార్చిలో కోరారు. రిటైర్డ్‌ ఈఎన్సీలతో కూడిన నిపుణుల కమిటీ 2022 మార్చిలో బరాజ్‌లను సందర్శించి షూటింగ్‌ వెలాసిటీని తగ్గించాలని సూచించింది. కానీ రివైజ్డ్‌ డిజైన్లు అందించకపోవడంతో బరాజ్‌ కుంగింది’’అని కమిషన్‌కు ఎంవీ రామకృష్ణరాజు వివరించారు. పీస్‌ రేటు కాంట్రాక్టు విధానంలో పనులు దక్కించుకున్న తమకు డిజైన్ల తయారీతో సంబంధం ఉండదని తెలిపారు. గడువులోగా పూర్తి చేయాలని ఒత్తిడి ఉన్నా నాణ్యతలో రాజీపడలేదని పేర్కొన్నారు.

విజిలెన్స్‌ విభాగం బరాజ్‌ నుంచి 90 కాంక్రీట్‌ నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తే.. ప్రమాణాలకు మించిన నాణ్యత ఉన్నట్టు తేలిందని వివరించారు. మేడిగడ్డ బరాజ్‌ నిర్మాణంలో లోపాలపై కమిషన్‌కు అఫిడవిట్‌ దాఖలు చేసిన ‘ఎల్‌ అండ్‌ టీ’మాజీ ఉన్నతాధికారి అమర్‌పాల్‌ సింగ్‌ వ్యవహారంపై స్పందించేందుకు ఎంవీ రామకృష్ణరాజు నిరాకరించారు.

మరో ఇద్దరు ప్రతినిధుల క్రాస్‌ ఎగ్జామినేషన్లో.. 
⇒ బరాజ్‌ గేట్ల నుంచి వరద సెకనుకు 6 మీటర్ల వేగం (షూటింగ్‌ వెలాసిటీ)తో దిగువన నేలను తాకుతుందనే అంచనాలతో నీటి పారుదల శాఖ (సీడీఓ) డిజైన్లను రూపొందించగా.. వాస్తవ వేగం సెకనుకు 16 మీటర్లుగా ఉందని, డిజైన్లలో లోపాలున్నాయని ఐఐటీ రూర్కీ అధ్యయనంలో తేలిందని ‘ఎల్‌ అండ్‌ టీ’హైడల్‌ ప్రాజెక్టు విభాగం ఉపాధ్యక్షుడు ఎస్‌.సురేశ్‌కుమార్‌ కమిషన్‌కు వివరించారు.

⇒ ఐఐటీ హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ రామరాజు బరాజ్‌ను సందర్శించి 2022 వర్షాకాలానికి ముందే షూటింగ్‌ వెలాసిటీని తగ్గించే ఏర్పాట్లు చేయాలని, లేకుంటే బరాజ్‌ దెబ్బతింటుందని హెచ్చరించారని కమిషన్‌కు ‘ఎల్‌ అండ్‌ టీ’డీజీఎం రజనీష్‌ పి.చౌహాన్‌ తెలిపారు. 7వ బ్లాక్‌కు మరమ్మతులు సాధ్యం కాదని, పూర్తిగా పునర్నిర్మించక తప్పదని పేర్కొన్నట్టు తెలిసింది. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)