Breaking News

మూసీ నిర్వాసితులను ఆదుకుంటాం

Published on Sat, 09/28/2024 - 06:16

సాక్షి, హైదరాబాద్‌:  మూసీ ప్రాజెక్టు కింద నిర్వాసితులయ్యే కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ దాన కిషోర్‌ చెప్పారు. శుక్రవారం మాసబ్‌ట్యాంక్‌లోని కార్యాలయంలో మూసీ పౌర సంస్థల ప్రతినిధులతో సుదీర్ఘంగా నిర్వహించిన సమావేశంలో సలహాలు, సూచనలు స్వీకరించారు. అనంతరం మాట్లాడారు. హైదరాబాద్‌ నగర భవిష్యత్తును కాపాడాలంటే.. మూసీ నదిని పునరుద్ధరించాల్సిందేనని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఏకపక్షంగా కాకుండా.. ఎన్జీవోలు, నిర్వాసిత కుటుంబాలతో చర్చించి, తరలింపు, పునరావాస కార్యక్రమాలను చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రతి నిర్వాసిత కుటుంబానికి జీవనోపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. 

పట్టా ఉంటే పరిహారం, ప్రయోజనాలు 
త్వరలోనే బఫర్‌ జోన్‌లో నిర్మాణాల సర్వే, మార్కింగ్‌ ప్రక్రియ చేపడతామని దాన కిశోర్‌ తెలిపారు. వారికి పునరావాస చట్టం ప్రకారం.. పరిహారం, ప్రయోజనాలు అందిస్తామని, ఆ తర్వాతే నిర్మాణాలను తొలగిస్తామని చెప్పారు. నిర్వాసిత కుటుంబాల్లోని విద్యార్థుల చదువు దెబ్బతినకుండా.. వారిని తరలించిన ప్రాంతంలోని పాఠశాలల్లో ప్రవేశాలు కల్పిస్తామని వెల్లడించారు. ఆసక్తి ఉన్న వారిని గురుకులాల్లో కూడా చేర్పిస్తామన్నారు. మూసీ పునరావాస ప్రక్రియ సజావుగా జరిగేందుకు ఉన్నతాధికారులతో హైలెవెల్‌ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు.

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు