Breaking News

ఆ ఆస్తులన్నీ నా కుమారుడివే..?

Published on Tue, 07/29/2025 - 07:29

సాక్షి, హైదరాబాద్‌:  ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన ఇరిగేషన్‌ మాజీ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్సీ) మురళీధర్‌రావు.. ఏసీబీ కస్టడీలో పలు కీలక వివరాలు వెల్లడించారు. చాలావరకు ఆస్తులు తన కుమారుడి సంపాదనతోనే కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులకు చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అక్రమార్జనపైనే ఏసీబీ అధికారులు లోతుగా ఆరా తీశారు. కోర్టు అనుమతితో ఈనెల 23 నుంచి ఏసీబీ అధికారులు మురళీధర్‌రావును కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు.

 ఆదివారంతో ఆయన కస్టడీ ముగిసింది. కాగా, ఈనెల 15న ఏసీబీ అధికారులు మురళీధర్‌ రావుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేయడం తెలిసిందే. ఏకకాలంలో హైదరాబాద్‌లోని మురళీధర్‌ రావు ఇంటితో పాటు.. కరీంనగర్, జహీరాబాద్‌ సహా మొత్తం 12 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. స్థిర, చరాస్తులతో పాటు పెద్ద మొత్తంలో బ్యాంకు డిపాజిట్లకు సంబంధించిన కీలకపత్రాలను ఏసీబీ అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. 

వీటితో పాటు బినామీల పేరుతో ఉన్న ఆస్తులను గుర్తించారు. ఐదు రోజుల కస్టడీలో మురళీధర్‌ రావు ఆస్తులపైనే ఏసీబీ అధికారులు కీలక వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. మొదట ఏసీబీ అధికారులకు సహకరించకపోయినా.. వరుసగా ఆస్తుల పత్రాలు, ఇతర కీలక పత్రాలను ముందుంచి ప్రశ్నించడంతో ఆయన సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. ఐదు రోజుల విచారణలో భాగంగా సేకరించిన సమాచారం ఆధారంగా.. కేసు దర్యాప్తును మరింత ముమ్మరం చేసేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు.    

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)