Breaking News

పాలిటిక్స్‌కు బ్రాండ్‌నేమ్‌

Published on Mon, 02/02/2026 - 11:01

నిర్మల్‌టౌన్‌: రాజకీయాల్లో ఒకతరం గెలవాలంటే ఎంతో కష్టపడాలి. అలా కష్టపడిన పదవి భరిస్తుందని గ్యారంటీ లేదు. అలాంటిది ఇప్పటివరకు ఒకే కుటుంబం నుంచి ముగ్గురు నిర్మల్‌ మున్సిపల్‌ చైర్మన్లు పనిచేశారు. నిర్మల్‌ రాజకీయాల్లో ఇలాంటి అరుదైన ఘనత వారికే దక్కింది. తాతబాటలోనే రాజకీయాల్లోకి వచ్చిన మనుమడు ప్రజాసేవనే లక్ష్యంగా ముందుకు సాగుతూ..మున్సిపాలిటీ పరిపాలనలో కీలకపాత్ర పోషించారు. వేరువేరు కాలాల్లో చైర్మన్లుగా పనిచేస్తూ.. పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, ప్రజాసమస్యల పరిష్కారంలో తమదైన ముద్రవేశారు. ఒక్క కుటుంబానికి వరుసగా ప్రజలు అవకాశవిువ్వడం, వారిపై నమ్మకానికి నిదర్శనమని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

మొదటగా అప్పాల నర్సయ్య..
మొదటిగా అప్పాల నర్సయ్య 1981 నుంచి 1982 వరకు నిర్మల్‌ మున్సిపల్‌ చైర్మన్‌గా పనిచేశారు. చేసిన రెండేళ్లలో అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై నిలకడమై పోరాడారు. మున్సిపాలిటీ పాలనలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆ తర్వాత 2006లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో మహిళ రిజర్వేషన్‌ రావడంతో నర్సయ్య కుమారుడు అప్పాల మహేశ్‌ భార్య అనురాధ కౌన్సిలర్‌గా గెలిచి చైర్మన్‌ పదవిని అధిరోహించింది. ఐదేళ్లు పట్టణ అభివృద్ధిని పరుగులు పెట్టించారు. రోడ్లు, డ్రెయినేజీలు, తాగునీటి సమస్యలు భూకబ్జాల నియంత్రణ వంటి సున్నిత అంశాల్లో వీరి నిర్ణయాలు ప్రశంసలు పొందాయి.

మూడోసారి అప్పాల గణేశ్‌ చక్రవర్తి
నర్సయ్య పెద్ద కుమారుడైన చక్రపాణి కొడుకు అప్పాల గణేశ్‌ చక్రవర్తి తాత బాటలో నిర్మల్‌పై పట్టు సాధించాడు. తాత వేసిన పునాదులపై నిలబడి రాజకీయ రంగ ప్రవేశం చేసి మున్సిపాలిటీ పీఠాన్ని దక్కించుకున్నారు. నిర్మల్‌ రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. రాజకీయ బలం, క్యాడర్‌పై పట్టు పెంచుకున్నారు. ఈయన 2014 నుంచి 2019 వరకు నిర్మల్‌ మున్సిపల్‌ చైర్మన్‌గా పనిచేశారు.

మళ్లీ ఈసారి బరిలో..
2026 మున్సిపల్‌ ఎన్నికల వేళ మున్సిపల్‌ చైర్మన్‌ (జనరల్‌ బీసీ మహిళ) రిజర్వేషన్‌ కావడంతో.. మరోసారి బరిలో దిగారు. మాజీ చైర్మన్‌ అప్పాల గణేశ్‌ చక్రవర్తి భార్య కావ్యను అధికార కాంగ్రెస్‌ నుంచి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా బరిలో నిలిపారు. ప్రత్యర్థులు ఎంత వ్యూహాలు రచించిన ఈ కుటుంబ రాజకీయ పట్టు చదరకపోవడం, మున్సిపాలిటీ రాజకీయాల్లో ఇప్పటికీ హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ కుటుంబ ప్రత్యేకత అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై నిలకడైన పోరాటంతో మున్సిపాలిటీ పనుల్లో తనదైన ముద్రవేసింది. ఇలాంటి రాజకీయ వారసత్వం నిర్మల్‌ మున్సిపల్‌ చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచింది.  

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)