Breaking News

అల్పాదాయ వర్గాలకు ‘ముంబై’ విధానం

Published on Wed, 12/10/2025 - 01:23

సాక్షి, హైదరాబాద్‌/బిజినెస్‌ బ్యూరో: ‘హైదరాబాద్‌ చుట్టుపక్కల భారీగా గృహ సముదాయాల నిర్మాణం జరుగుతోంది. కానీ ఇవన్నీ, ధనికులను దృష్టిలో ఉంచుకుని జరుగుతున్నవే. లగ్జరీ ఇళ్ల నిర్మాణం దాదాపు శాచురేషన్‌కు చేరుకుంది. అల్పాదాయం ఉన్న వర్గాలను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. ఆ వర్గాలకు ఇళ్లు పొందటం కష్టంగా ఉంది. 

బడా నిర్మాణ సంస్థలు ఆ వర్గాలకు ఇళ్లను నిర్మించి ఇచ్చేలా పీపీపీ ప్రాజెక్టులు రావాల్సి ఉంది’ చవక ధరల్లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి నిపుణులు ప్రభుత్వం దృష్టికి తెచ్చిన సూచన ఇది.గ్లోబల్‌ సమ్మిట్‌లో భాగంగా మంగళవారం ‘అఫర్డబుల్‌ హౌసింగ్‌ పాలసీ ఫర్‌ అర్బన్‌ ఫ్యూచర్‌–తెలంగాణ మోడల్‌ 2047’అంశంపై గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో చర్చాగోష్టి జరిగింది. 

సీబీఆర్‌ఈ దక్షిణాసియా ప్రతినిధి ప్రీతం మెహ్రా సంధానకర్తగా వ్యవహరించగా, గృహనిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి గౌతం, వాసుదేవన్‌ సురేష్‌ (హడ్కో మాజీ సీఎండీ), అభిజిత్‌ శంకర్‌ రే (వరల్డ్‌ బ్యాంక్‌ ప్రతినిధి), డాక్టర్‌ పీఎస్‌ఎన్‌ రావు (ఎస్‌పీఏ ఢిల్లీ), జి.రామ్‌రెడ్డి (క్రెడాయ్‌ అ«ధ్యక్షుడు), ఎం.నంద కిషోర్‌ (రాంకీ ఎండీ), అజితేష్‌ (ఏఎస్‌బీఎల్‌ ఫౌండర్‌) పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎల్‌ఐజీ కేటగిరీలో 20.33 లక్షల ఇళ్లు, ఎంఐజీ కేటగిరీలో 8.77 లక్షల ఇళ్ల అవసరం ఉందని గృహనిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి గౌతం తెలిపారు. 

ప్రత్యేక నమూనా దిశగా: పొంగులేటి 
‘రాష్ట్రంలో గృహాల డిమాండ్‌– సరఫరా మధ్య భారీ అంతరం ఉంది. దీన్ని తగ్గించేందుకు వ్యక్తిగత పథకాలకు పరిమితం కాకుండా, పట్టణ ప్రాంతాల అవసరాలపై దృష్టి కేంద్రీకరించి, సమతుల్యతతో కూడిన గృహ నిర్మాణ తెలంగాణ నమూనా–2047 వైపు అడుగులేస్తున్నాం. ఈ నమూనా ఆర్థికంగా లాభదాయకంగా, సామాజికంగా ఉంటుంది. పీపీపీ విధానంలో ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్య పేదల కోసం భారీ కాలనీలను నిర్మించే యోచనలో ఉన్నాం. 

మురికివాడల పునరాభివృద్ధి, గ్రీన్‌ఫీల్డ్‌ శాటిలైట్‌ టౌన్‌షిప్‌లు, పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికుల కాలనీలు, పారిశ్రామిక పార్కులు, లాజిస్టిక్స్‌ హబ్‌లతో అనుసంధానిస్తూ అద్దె/కార్మికుల కాలనీల నిర్మాణం ప్రధాన వ్యూహాలుగా నమూనాను రూపొందించాం’అని మంత్రి పొంగులేటి చెప్పారు. 

అందుబాటులో ధరల్లో గృహాలు లభించాలంటే పన్ను రాయితీల్లాంటివి సరిపోవని, మరింత అనువైన వ్యవస్థ కావాలని రామ్‌కీ ఎస్టేట్స్‌ ఎండీ నందకిషోర్‌ తెలిపారు.  ఇళ్లు, స్థలాల ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో రెంటల్‌ హౌసింగ్‌ విధానాన్ని అందుబాటులోకి తేవడంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని బ్లాక్‌స్టోన్‌ రియల్‌ ఎస్టేట్‌ ఇండియా ఎండీ మోహిత్‌ అరోరా చెప్పారు. 

Videos

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)