Breaking News

ములుగు ఎన్‌కౌంటర్‌: మధు మృతదేహం అప్పగింతకు ఆదేశం

Published on Thu, 12/05/2024 - 15:52

హైదరాబాద్‌, సాక్షి: ములుగు జిల్లా ఏటూరు నాగారం మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది. మల్లయ్య అలియాస్‌ మధు మృతదేహాన్ని కూడా భార్య ఐలమ్మకు అప్పగించాలని ఆదేశించింది. శుక్రవారం(నవంబర్‌ 6) మధ్యాహ్నాంలోగా అప్పగింత పూర్తి చేయాలని.. మృతదేహంపై గాయాలుంటే గనుక ఫొటోలు, వీడియోలు తీయాలని స్పష్టం చేసింది.  

ఏటూరునాగారం మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. గత విచారణలో.. ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఏడుగురు మావోయిస్టుల్లో ఈగోలాపు మల్లయ్య అలియాస్‌ మధు తప్ప మిగిలిన ఆరుగురి మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో.. మల్లయ్య మృతదేహం అప్పగించకపోవడంతో.. భార్య ఐలమ్మ అలియాస్‌ మీనా హైకోర్టును ఆశ్రయించారు.

గత విచారణలో.. ‘‘ఈ ఎన్‌కౌంటర్‌ బూటకమని, మావోయిస్టులు తినే ఆహారంలో మత్తుపదార్థాలు కలిపి చిత్రహింసలు పెట్టి చంపారు’’ అని పిటిషనర్‌ తరఫు న్యాయవాది సురేష్‌ కుమార్‌. అలాగే.. శవ పంచనామాలో కుటుంబసభ్యులను అనుమతించలేదని, పోస్ట్‌మార్టం ఫోరెన్సిక్‌ నిపుణుల ఆధ్వర్యంలో జరగలేదని పేర్కొన్నారు.  మల్లయ్య మృతదేహాన్ని చూడటానికి ఐలమ్మను కేవలం 10 నిమిషాలే అనుమతించారని, ఈ కొద్ది సమయంలోనే ఆమె తన భర్త మృతదేహంపై దాదాపు 11 గాయాలను గుర్తించారని తెలిపారు. శవ పంచనామాకు పిటిషనర్‌ను అనుమతించలేదన్నారు. ఎన్‌హెచ్చార్సీ మార్గదర్శకాల ప్రకారం జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ఆధ్వర్యంలో శవ పంచనామా జరిపించేలా ఆదేశించాలని కోరారు. ఇది ఎన్‌కౌంటర్‌ కాదని.. కస్టోడియల్‌ డెత్‌ అని ఆరోపించారు. 

వాదనలు నమోదు చేసుకున్న విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం.. పిటిషనర్‌ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆమె భర్త మల్లయ్య మృతదేహం తప్ప మిగితావాళ్లవి వారి బంధువులు అడిగితే అప్పగించాలని స్పష్టం చేసింది. పోస్ట్‌మార్టం ఎగ్జామినేషన్‌, శవపంచనామా నిర్వహణలో అనుసరించిన విధానంపై సంక్షిప్త వివరాలు సమర్పించాలని పేర్కొంది. ఇవాళ.. మృతదేహం అప్పగింతపై ఆదేశాలిచ్చింది.

చల్పాక-ఐలాపూర్‌ అటవీ ప్రాంతంలో ఈ నెల 1న జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు మరణించిన ఘటనపై కలెక్టర్‌ దివాకర ఇదివరకే విచారణకు ఆదేశించారు. విచారణ అధికారిగా ములుగు ఆర్డీవో వెంకటేశ్‌ను నియమించారు.

 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)