Breaking News

తోలు తీస్తామంటే చూస్తూ ఊరుకోవాలా?

Published on Fri, 12/26/2025 - 01:34

సాక్షి, హైదరాబాద్‌: ప్రజల చేతిలో ఓడిపోయిన రెండేళ్ల తర్వాత బయటకు వచ్చి తోలు తీస్తామని అంటుంటే తాము చూస్తూ ఊరుకోవాలా అని భువ నగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. సీఎం స్థాయి వ్యక్తిని తోలు తీస్తామని మాజీ సీఎం అంటుంటే ఇంకా మర్యాదగా మాట్లాడాలా అని నిలదీశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావుకు కౌంటర్‌ ఇచ్చారు. ‘దెయ్యాలు వేదాలు వల్లించినట్టు హరీశ్‌రావు వ్యవహారశైలి ఉంది. నీతులు మాకు కాదు ఎదుటి వారికి మాత్రమే అన్నట్టు ఆయన మాట్లాడుతున్నాడు.

ఒకసారి వాళ్ల మామ మాట్లాడిన పురాణం, బూతులు వింటే తెలుస్తుంది. బూతులు మాట్లాడే పేటెంట్‌ కేసీఆర్‌కు మాత్రమే ఉంది. ఆయన తిట్ల పురాణం మొదలుపెట్టారు కాబట్టే సీఎం రేవంత్‌ కూడా మాట్లాడారు. ఆయన రాజకీయం గురించి మాట్లాడితే రేవంత్‌రెడ్డి కూడా అదే మాట్లాడి ఉండేవారేమో? మీరు పద్ధతిగా మాట్లాడితే మేమూ పద్ధతిగానే మాట్లాడుతాం’ అని వ్యాఖ్యానించారు.

హరీశ్‌రావు తన పాండిత్యంతో వేదాంతాలు చెబుతున్నారని, ఆయన నీతులు కేసీఆర్, కేటీఆర్‌లకు చెప్పాలని హితవు పలికారు. ఇకనైనా వ్యక్తిగత విమర్శలు మానుకుని ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని సూచించారు. సీఎం, మాజీ సీఎం పరస్పరం గౌరవించుకోవాలని చెబుతున్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఆ సూక్తులను బీఆర్‌ఎస్‌ దద్దమ్మలకు చెప్పాలని ఎంపీ చామల కోరారు.

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)