Breaking News

కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు ఎంపీ అరవింద్‌ వినతి

Published on Sun, 06/15/2025 - 21:23

హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంలో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.  ఈ మేరకు ఎంపీ అరవింద్‌ పీటీఐతో మాట్లాడిన సందర్భాన్ని ఎక్స్‌లో షేర్‌ చేశారు. ‘ కేసీఆర్‌ ప్రభుత్వంలో నా ఫోన్‌ ట్యాప్‌ చేశారంటూ వస్తున్న వార్తలు ఆందోళన కల్గిస్తున్నాయి. 

నాపై మానసికంగానే కాదు.. శారీరకంగానూ కేసీఆర్‌ ప్రభుత్వం దాడి చేయించింది. ఇది రాజకీయ ఎజెండా మాత్రమే కాదు.. ఇది నేరపూరితమైన దాడి. షోన్‌ ట్యాపింగ్‌ ద్వారా కేవలం ఫోన్‌ కాల్స్‌లోకే కాదు బెడ్‌ రూమ్‌లోకి, బాత్రూమ్‌లోకి చట్టవిరుద్ధంగా చొరబడ్డారు. నాపై వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు ప్రభుత్వ నిఘా వ్యవస్థను ప్రైవేటు నిఘా వ్యవస్థగా వాడుకుంది గత ప్రభుత్వం. ఇది ప్రజాస్వామ్యం జరిగిన దాడిగా చూడాలి. తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు ఈ విషయంలో చొరవ తీసుకుని కేంద్ర విచారణ సంస్థలతో దర్యాప్తు చేపట్టాలి’ అని అరవింద్‌ కోరారు. 


 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)